Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆ సెక్సీ హరోయిన్ కూడా మరో ‘అరుంధతి’అయిపోయిందా..!?
ఇన్నాళ్లూ గ్లామర్ తారగా, ఎక్స్ పోజింగ్ కే పరిమితమైన కథానాయిక ప్రియమణి, తాజాగా చేస్తున్న 'క్షేత్రం' సినిమా మీద మాత్రం చాలా ఆశలు పెట్టుకుంది. ఎప్పుడూ మోడరన్ దుస్తుల్లో సెక్సీగా కనిపించే ప్రియమణి ఇందులో పట్టు చీర కడుతుందట. నుదుటిన పెద్దబొట్టు కూడా పెడుతుందట. అందుకే, ఈ సినిమా ద్వారా ఎవరూ ఊహించని ప్రియమణిని చూస్తారని ధీమాగా చెబుతోంది. ఇందులో కథంతా తన చుట్టూనే తిరుగుతుందట.
'ఇది నిజంగా కొత్త తరహా పాత్రే. నేను కత్తి యుద్ధం కూడా చేయాల్సి ఉంటుందని దర్శకుడు చెప్పారు. ఒకవేళ అలా చేయాల్సి వస్తే కనుక ముందు పక్కాగా ప్రాక్టీస్ చేస్తాను' అంటోంది. అన్నట్టు, 'అరుంధతి' సినిమా ద్వారా అనుష్క ఎంతటి పేరు తెచ్చుకుందో.. ఈ 'క్షేత్రం' ద్వారా ప్రియమణికి కూడా అంతటి పేరూ వస్తుందని యూనిట్ వాళ్లు చెబుతున్నారట.!
జగపతి బాబు, ప్రియమణి జంటగా నటిస్తున్న చిత్రం 'క్షేత్రం'.ఈ చిత్రంలో 'కిక్' శ్యాం ప్రధాన పాత్రధారిగా నటిస్తున్నాడు.ఈ సినిమాలో జగపతిబాబు వీర నరసింహరాయులుగా కనిపిస్తారు. ఆ పాత్ర చాలా గంభీరంగా ఉంటుంది. ప్రేమ నిండిన మనషుల మధ్య కురుక్షేత్రం లాంటి వాతావరణం ఎందుకు వస్తుంది అన్న పాయింట్ మీద ఈ సినిమా నడుస్తుంది. ఈ చిత్రం లో ఆదిత్య మీనన్, బ్రహ్మానందం, సురేష్, రాజీవ్ కనకాల, పోసాని క్రిష్ణ మురళి, ఉత్తేజ్,చలపతి రావు మొదలగువారు నటిస్తున్నారు.