అలాంటి నీచులు ఇండియాలోనూ.... : హింట్ ఇచ్చిన ప్రియాంక చోప్రా
హార్వీ వెయిన్‌స్టన్ లాంటి వారు ఇండియాలో కూడా ఉన్నారని ప్రియాంక చోప్రా అన్నారు.
హాలీవుడ్లో నిర్మాత హార్వీ వెయిన్‌స్టన్ వ్యవహారం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. తన లైంగిక వాంఛలు తీర్చుకునేందుకు హీరోయిన్లను వేధింపులకు గురిచేసారనే వాస్తవాలు బయటకు రావడంతో హాలీవుడ్‌తో పాటు ప్రపంచ సినీ పరిశ్రమ అతడిని అసహ్యించుకుంటోంది.
ఇలాంటి నీచుడు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల కమిటీ సభ్యుడిగా కొనసాగడానికి వీల్లేదంటూ... అతడి సభ్యత్వాన్ని సైతం రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా హాలీవుడ్లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెలుతున్న ఇండియన్ బ్యూటీ ప్రియాంక చోప్రా హార్వీ వెయిన్‌స్టన్ వ్యవహారంపై స్పందించారు.

అలాంటి నీచులు ఇండియాలోనూ
మెయిరే క్లెయిర్ పవర్ ట్రిప్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక చోప్రా.... హర్వీ వెయిన్‌స్టన్ లాంటి కామాంధులు అంతటా ఉంటారని వ్యాఖ్యానించారు. ఇలా వ్యాఖ్యానించడం ద్వారా ఇండియాలోనూ అలాంటి నీచులు ఉన్నారని ఆమె చెప్పకనే చెప్పారు.

చాలా దారుణం
తమ పవర్ ఉపయోగించి మహిళలను లొంగ దీసుకోవడం, వారిని శారీరకంగా వాడుకోవాలని చూడటం అత్యంత దారుణమైన చర్యగా ప్రియాంక చోప్రా పేర్కొన్నారు.

డజన్ల కొద్దీ బలయ్యారు
హార్వీ వెయిన్‌స్టన్ ఇప్పటి వరకు మూడు డజన్లకుపైగా మహిళలను సెక్సువల్ హరాస్మెంట్ చేశాడు, వేధింపులకు గురి చేశాడు. గెనైత్ పాల్ట్రో, కారా డెలెవింగ్నే, లుపితా నైయోంగ్, ఏంజలీనా జోలీ లాంటి వారు ఉన్నారని, ఈ విషయాలు విని తాను షాకయ్యానని.... ప్రియాంక చోప్రా తెలిపారు.

కేవలం సెక్స్ గురించి కాదు
ఇది కేవలం సెక్స్ గురించి కాదు, సెక్స్ వాలిటీ గురించి కాదు, ఇది పవర్ గురించి.... అంటూ మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను ఉద్దేశించి ప్రియాంక చోప్రా వ్యాఖ్యానించారు.

సమాజంలో మార్పు రావాలి
వస్త్రధారణ లాంటి చిన్న చిన్న నిర్ణయాలు కూడా మహిళలు స్వతంత్ర్యగా తీసుకోలేని పరిస్థితి ఉంది. సమాజంలో మార్పు రావాలి. ఇలాంటి విషయంలో ఇతరులకు భయపడరాదు. అమ్మాయిలు చాలా ధైర్యంగా ఉండాలి... అంటూ ప్రియాంక చోప్రా పిలుపునిచ్చారు.


Click it and Unblock the Notifications











