సక్సెస్, ఫెయిల్యూర్స్ చూశా.. ఆ ఒక్క విషయాన్నే నమ్మా.. రాధిక ఎమోషనల్ స్పీచ్
పలాస చిత్రంతో నటుడిగా నిరూపించుకొన్న రక్షిత్ అట్లూరి నటించిన తాజా చిత్రం ఆపరేషన్ రావణ్. ధ్యాన్ అట్లూరి నిర్మాతగా వెంకట సత్య రచయితగా, దర్శకత్వ బాధ్యతలు చేపట్టి రూపొందించిన చిత్రం విడుదలకు సిద్దమైంది.
రాధిక శరత్ కుమార్, రఘు కుంచె తదితరులు నటించిన ఈ చిత్రం ప్రమోషన్స్ కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఆపరేషన్ రావణ్ ఫస్ట్ థ్రిల్ వీడియోను ప్రసాద్ ల్యాబ్‌లో ప్రదర్శించారు. ఈ వేడుకకు దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, మారుతి, దర్శకుడు కల్యాణ్ కృష్ణ, సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాధిక శరత్ కుమార్ ఎమోషనల్‌గా మాట్లాడుతూ..
ఆపరేషన్ రావణ్ ఫస్ట్ థ్రిల్ వీడియో ఆవిష్కరణ కార్యక్రమంలో రాధిక శరత్ కుమార్ మాట్లాడుతూ... దర్శకుడు వెంకట్ సత్య, హీరో రక్షిత్ తండ్రి కొడుకులు అనే విషయం ఇప్పడే తెలిసింది. స్టేజ్ మీద రక్షిత్ గోల్డెన్ స్పూన్‌తో పుట్టాడని అని అంటుంటే.. నాకు వారిద్దరు తండ్రి కొడుకులు అని తెలిసింది. దాంతో గోల్డెన్ స్పూన్‌తో కాదు.. రక్షిత్ గోల్డెన్ ప్లేట్‌తో పుట్టాడనిపిస్తుంది.

ఆపరేషన్ రావణ్ కథ వినగానే, స్టోరీ నేరేట్ చేయగానే నాకు నచ్చింది. వెంటనే ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకొన్నాను. అయితే హీరో ఎవరు అని అడిగితే.. రక్షిత్ అని చెప్పారు. రక్షిత్ సూచన మేరకు పలాస చిత్రాన్ని చూశాను. ఆ సినిమా నాకు బాగా నచ్చింది.
నాకు ఆ సినిమా రైటింగ్ బాగా నచ్చింది. రైటింగ్ బాగుంటేనే సినిమా బాగుంటుందని అన్నారు. రక్షిత్ రా, ఇంటెన్స్‌గా నటించాడు. ఈ సినిమాలో నటించేటప్పుడు చాలా హార్డ్ వర్క్ చేశాడు. కష్టపడితే ఫలితం ఎప్పుడూ ఉంటుంది అని రాధిక అన్నారు.

నా లైఫ్‌లో సక్సెస్ ఉంది.. ఫెయిల్యూర్స్ ఉన్నాయి. జీవితం ఎగుడుదిగుడులు ఉన్నాయి. కానీ నేను ఎప్పడూ ఓటమిని ఒప్పుకోలేదు. కష్టాన్నే నమ్ముకొన్నాను. అదే నాకు మంచి ఫలితాలను ఇచ్చింది. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు.
దర్శకుడిగా వెంకట సత్య అందరి నుంచి మంచి ప్రతిభను రాబట్టుకొన్నాడు. రక్షిత్ ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేకున్నా.. బాగా రాణిస్తున్నాడు. కష్టపడే తత్వం ఉంది. అతడికి మంచి భవిష్యత్ ఉంటుంది. ఆపరేషన్ రావణ్ తప్పకుండా సక్సెస్ అవుతుంది అని అన్నారు.


Click it and Unblock the Notifications











