టీఆర్పీల కోసం మా జీవితాలో ఆడుకుంటున్నారు

By Bojja Kumar

టీఆర్పీ రేటింగుల కోసం కొన్ని టీవీ ఛానల్స్ మా జీవితాలతో ఆడుకుంటున్నాయని, మా గురించి చాలా నీచంగా ప్రచారం చేస్తూ, లోకువ చేసి మాట్లాడుతూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళుతున్నారని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. ఇటీవల ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో న్యూస్ ప్రజెంటర్ సినీ తారలపై అత్యంత హేయమైన కామెంట్స్ చేయడంపై నిరసన వ్యక్తం చేస్తూ 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఏర్పాటు చేసిన సమావేశంలో రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

సినిమాలకు సంబందించిన ప్రెస్ మీట్లు జరిగే సమయంలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడాలని చాలా మంది అడుగుతారు. తెలుగు సినిమా పరిశ్రమలో అలాంటిదేమీ లేదని, నాకు అలాంటి పిరిస్థితులు ఎప్పుడూ ఎదురు పడలేదని చాలా సార్లు చెప్పాను. అయినా పదే పదే అడుగుతారు... అని రకుల్ పేర్కొన్నారు.

Actress Rakul Preet Singh Fires On Media Abusing Actresses

ఇన్నాళ్లు మీడియాలో తమ గురించి అభ్యంతరంగా ప్రచారం జరిగినా సహించాం. కానీ ప్రస్తుతం చోటు చేసుకున్న ఇష్యూ సహించరానిది, క్షమించరానిది అని రకుల్ అన్నారు. నటి అంటే కూడా ఒక మహిళే. తల్లిదండ్రులు మహిళల పట్ల ఎలా బిహేవ్ చేయాలో సరిగా నేర్పించక పోవడం వల్లనే ఇలా ప్రవర్తిస్తారు అని రకుల్ అన్నారు.

సినీ తారల గురించి, వారి క్యారెక్టర్ గురించి మీడియాలో నీచంగా రాయడంపై 'తెలుగు సినీ పరిశ్రమ' సీరియస్‌గా . ఇటీవల ఓ టీవీ చానల్‌ చర్చా కార్యక్రమంలో ఓ న్యూస్ ప్రజెంటర్ సినిమా ఇండస్ట్రీలోని తారలపై అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన 'మా' సభ్యులు.... మంగళవారం సమావేశం అయి తమ పట్ల మీడియా వ్యవహరిస్తున్న తీరుపై నిరసన వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X