twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తప్పంతా సావిత్రమ్మదే, ఆయనతో నాది లివి-ఇన్ రిలేషన్: రమాప్రభ

    By Bojja Kumar
    |

    తెలుగు సినిమా పరిశ్రమలో పరచయం అక్కర్లేని పేరు రమాప్రభ. బ్లాక్ అండ్ వైట్ సినిమా దగ్గర నుండి నేటితరం వరకూ 1500లకు పైగా చిత్రాల్లో ఆమె నటించారు, ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. ప్రముఖ నటి సావిత్రికి అత్యంత సన్నిహితంగా మెలిగినవారిలో రమాప్రభ ఒకరు... ఎంతలా అంటే సావిత్రి వంటింట్లోకి, బెండ్రూంలోకి చొచ్చుకుపోయేంత! ఇటీవల సావిత్రి జీవితంపై 'మహానటి' సినిమా వచ్చిన నేపథ్యంలో ఓ ప్రముఖ వెబ్ ఛానల్ రమాప్రభను ఇంటర్వ్యూ చేశారు. ఇందులో ఆమె సావిత్రి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దీంతో పాటు శరత్ బాబుతో తన వైవాహిక బంధం గురించి కూడా వెల్లడించారు.

    Recommended Video

    Rama Prabha About Present Actors Behaviour
    అందుకే నాకు అవకాశాలు ఇవ్వడం లేదు

    అందుకే నాకు అవకాశాలు ఇవ్వడం లేదు

    ఈ జనరేషన్ దర్శకులు మీకు ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదనే ప్రశ్నకు రమాప్రభ స్పందిస్తూ... ఇప్పటి డైరెక్టర్లకు చాలా మందికి ఇగో ఉందని, వారికి మా లాంటి సీనియర్ ఆర్టిస్టులను గౌరవించడం తెలియదని, దాంతో పాటు వారు అనుకున్న సినిమా బిజినెస్‌కు నేను సరిపోననే భావన కూడా ఉండొచ్చు అన్నారు. అలాగే చాలా మంది మేనేజర్లు కంఫర్టు, ఫ్యాకేజీలు ఆశిస్తారు. నా నుండి అలాంటివి ఉండవు కాబట్టే దర్శకులు, నిర్మాతలకు నేను నటించాలని ఉన్నా... ఏదో ఒక కారణంతో వారికి కంఫర్టుగా ఉండే వారిని పెట్టుకునేలా ప్లాన్ చేసుకుంటారు అని రమాప్రభ తెలిపారు.

    ఎవడైనా కళాసేవ చేస్తున్నానంటే మండి పోతుంది

    ఎవడైనా కళాసేవ చేస్తున్నానంటే మండి పోతుంది

    ఈ మధ్య కొందరు కళాసేవ చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఎవడైనా అలా అంటే నాకు మండి పోతుంది. మనం ఎక్కడ కళాసేవ చేస్తున్నాం? డబ్బులు తీసుకుంటున్నాం. ఓసీలో ఏసీ అనుభవిస్తున్నాం. స్టైల్‌గా ఉంటున్నాం. ఇది సేవా? తప్పుకదా అలా అనడం. ఏ ఆసుపత్రికైనా వెళ్లి మా కళతో వారిని ఆనంద పరిచామా? ఏ పిచ్చి వారి దగ్గకైనా వెళ్లి నాలుగు జోకులు వేసి నవ్వించామా? డబ్బులు, పేరు దొబ్బడం కళా సేవా? అని రమా ప్రభ ప్రశ్నించారు.

    తప్పంతా సావిత్రమ్మదే

    తప్పంతా సావిత్రమ్మదే

    జెమినీ గణేశన్-సావిత్రి రిలేషన్ దెబ్బ తినడంలో తప్పంతా సావిత్రమ్మదే. ఎంత ధర్మ గుణం ఉందో, ఎంత స్నేహ గుణం ఉందో... అంతే ధైర్యం, అంతే మొండి తనం ఉంది. తనకు దగ్గరగా ఉండి చాలా ప్రేమించే వారిని పో పో అని దూరం చేసుకుంది అని రమాప్రభ తెలిపారు.

     జెమినీ మామ చాలా మంచోడు

    జెమినీ మామ చాలా మంచోడు

    సావిత్రమ్మ ఎంత మొండిదైనా జెమినీ ప్రేమించాడు. అంతలా ప్రేమించిన ఆయన్ను పనిమనుషులతో గెంటించింది, కుక్కలతో తరిమించింది. అయినా ఆమెపై జెమినీ ప్రేమను చంపుకోలేక గోడదూకి వచ్చి కిటికీలోంచి చూసేవాడు..... అని రమాప్రభ గుర్తు చేసుకున్నారు.

     జెమినీ వల్లనే సావిత్రమ్మకు లైఫ్

    జెమినీ వల్లనే సావిత్రమ్మకు లైఫ్

    జెమినీ వల్లనే అమ్మకు లైఫ్. జెమినీ మామ ప్రేమించినంత ఎవరూ ప్రేమించ లేదు. ఆమెకు బాగా ఇగో, బాగా మొండి... అలా అని చెడ్డది కాదు. ఆ మొండి తనం వల్లే ఇదంతా జరిగింది. ఆమె చివరి రోజుల్లో బీదరికం అనుభవించింది అనేది నిజం కాదు.... అని రమాప్రభ తెలిపారు.

    ఆమెకు మందు తాగడం ఎవరూ నేర్పలేదు

    ఆమెకు మందు తాగడం ఎవరూ నేర్పలేదు

    సావిత్రమ్మకు మందు తాగడం ఎవరూ నేర్పించలేదు. మొండితనంతో జెమినీని సాధించడానికి తాగేది. ఆమెకు ఎవరూ శత్రువులు లేరు. అందరికీ పెట్టే అలవాటు ఉందే తప్ప మరేమీ కాదు. ఓసారి కారు నడుపుకుంటూ వెళ్లి ఒకరిని గుద్దేసింది. కారును అక్కడే వదిలేసి వచ్చేసింది. ఆ కారు ఏమైందో? అలా ఉండేది సావిత్రి ప్రవర్తన అని.... రమాప్రభ గుర్తు చేసుకున్నారు.

    అలా చూపించడం దారుణం

    అలా చూపించడం దారుణం

    జెమినీ గణేశన్ తాగుడు అలవాటు చేయించాడు అనేది చూపించడం చాలా దారుణం. సావిత్రి అంత మొండిగా, ఆరోగెంటుగా ఉన్న కూడా ప్రేమించిన ఒకే మనిషి జెమిని. చివరి వరకు ఆమెపై అదే ప్రేమ చూపించాడు. చివరి రోజుల్లో ఆసుపత్రిల్లో ఉన్నపుడు నేను ఇది స్వయంగా చూశాను అని రమాప్రభ గుర్తు చేసుకున్నారు.

     అలా సావిత్రి ఆస్తులు పోయాయి

    అలా సావిత్రి ఆస్తులు పోయాయి

    సావిత్రి తాగేసి ఉంటే పని వాళ్లు చిన్న చిన్నవి కొట్టేయడం జరిగేది, కొందరు చెక్కుల మీద సంతకాలు తీసుకోవడం జరిగింది. ఆమె ఆస్తి పోవడానికి ప్రధాన కారణం సొంతగా సినిమాలు తీయడమే. వద్దని జెమినీ అంటూనే ఉన్నాడు. అందుకే ఆయన్ను తరిమించింది. ఒకసారి నా చేతనే తరిమించింది. అందరి ముందు ఆయన్ను వాడు అనేది, వాడిని తరిమేయ్ అనేది. అక్కా నువ్వు అట్లా చెప్పొద్దు అంటే నువ్వు మూస్తావా? లేదా? అని నన్ను చేతిలో పెస్తకం ఉంటే పుస్తకం, ప్లేటు ఉంటే ప్లేటుతో కొట్టేది.... అని రమాప్రభ గుర్తు చేసుకున్నారు.

     నాకు సావిత్రి ఏమీ సహాయం చేయలేదు

    నాకు సావిత్రి ఏమీ సహాయం చేయలేదు

    చాలా మంది వద్ద సావిత్రి ఆస్తులు ఉన్నాయని, చివరి రోజుల్లో తిరిగి అడిగితే ఇవ్వలేదు అనేది అబద్దం. ఈవిడ అడగలేదు, అడగదు కూడా. ఆ మధ్య సావిత్రి నాకు సహాయం చేసినట్లు వార్తలు వచ్చాయి. అది అసలు నిజం కాదు. ఆమె చివరి దశలో ఉన్నపుడే నా కెరీర్ ఫుల్‌పీక్ స్టేజీలో ఉంది.... అని రమాప్రభ తెలిపారు.

    శరత్ బాబుతో వివాహం, విడాకుల గురించి

    శరత్ బాబుతో వివాహం, విడాకుల గురించి

    శరత్ బాబును పెళ్లి చేసుకుని 14 సంవత్సరాలు కలిసున్నాను. అపుడు మేము పిల్లల గురించి ఆలోచించలేదు. ఆయనకు పెద్ద ఫ్యామిలీ, నాదీ పెద్ద ఫ్యామిలీ. ఇద్దరం కెరీర్ పరంగా పైకొస్తున్నాం. పిల్లల కొతర లేదు అనే విధంగా మా ఫ్యామిలీ ఉండేది. మా ఆలోచన ఆ సైడ్ పోలేదు. మా వివాహ బంధం కమర్షియల్ అని చెప్పలేం, అలా అని పక్కా అని చెప్పలేం. ఉన్నామంతే. ఇంగ్లీష్ స్టైల్‌లో చెప్పాలంటే లివింగ్ టుగెదర్.... అని రమాప్రభ తెలిపారు.

    మీరు మొగోడు అనిపించుకోవడానికే బిడ్డను కనాలే తప్ప

    మీరు మొగోడు అనిపించుకోవడానికే బిడ్డను కనాలే తప్ప

    పిల్లలు లేరనే బాధ నాకు ఎప్పుడూ లేదు, ఉండదు కూడా. పిల్లలకు పెద్దల వాళ్ల మీద ప్రేమ ఆస్తుల విషయంలోనే తప్ప మరే విషయంలోనూ ఉండదు. ఇక పురుషులు నలుగురిలో నేను మగాడిని అనిపించుకోవడానికే బిడ్డను కనాలే తప్ప లేక పోతే అది ఇపార్టెంట్ కాదు. అసలు పిల్లలను ఎందుకు కనాలి? వారుసులు లేకపోతే ఎలా అనడానికి మీదేమైనా రాజవంశమా? వెయ్యి ఎకరాలు ఆస్తి ఉందా?... అంటూ తనదైన రీతిలో స్పందించారు రమాప్రభ

     శరత్ బాబు వస్తే వందశాతం ఆహ్వానిస్తా

    శరత్ బాబు వస్తే వందశాతం ఆహ్వానిస్తా

    విడిపోయిన తర్వాత శరత బాబు నాకు చాలా సార్లు ఎదురయ్యాడు. నేను మామూలుగానే ఉంటా. ఆయనే ఇలా మూతి పెట్టుకుని మాట్లాడకుండా ఉంటాడు. అతడు అంత రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అతడి ఆస్తి నేనేమీ తినలేదు. శరత్ బాబు ఒక వేళ రియలైజ్ అయి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? అనే ప్రశ్నకు రమాప్రభ స్పందిస్తూ....వంద శాతం సంతోషంగా రిసీవ్ చేసుకుంటాను. అదొక రిలేషన్ అనుకుంటా. నాకు ఇగో లేదు. ఎటాచ్మెంటు లేదు డిటాచ్మెంటు లేదు. అందరిలాగే ఆయన్ను ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తాను అని రమాప్రభ తెలిపారు.

    English summary
    Rama Prabha is an Indian actress who performs in Telugu language, Tamil and Hindi films. She acted in more than 1400 films. She was credited as a character artist who shared screen space with all generation superstars. Her career spans over four decades. She formed a noted pair on Telugu screen during the 1970s and 1980s with comedian Raja Babu.She acted opposite Nagesh in Shanti Nilayam and many other films from 1968 onwards. She acted in Hindi opposite Mehmood in Do Phool.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X