మూడో బిడ్డకు జన్మనివ్వబోతున్న రంభ!
దశాబ్దకాలానికిపైగా సినీ ప్రేక్షకులను సినీ నటి రంభ అలియాస్ విజయలక్ష్మీ ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేష్, హిందీలో సల్మాన్ ఖాన్ లాంటి అగ్రనటులతో నటించి మెప్పించారు. వివాహం తర్వాత ఆమె సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రంభ తాజాగా తన అభిమానులకు శుభవార్తను అందించారు. తాను మూడో బిడ్డకు జన్మనివ్వబోతున్నాను అని ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా నన్ను అభిమానించే వారికి ఓ శుభవార్తను అందించాలనుకొంటున్నాను. నేను మూడో బిడ్డకు జన్మనివ్వబోతున్నానని తెలపడానికి గర్వంగా ఉంది. కడుపులో పెరుగుతున్న బిడ్డతో కూడిన ఫొటోను ఈ సందర్భంగా షేర్ చేస్తున్నాను. ఈ సమయంలో నేను అనుభవిస్తున్న సంతోష క్షణాలను మాటల్లోచెప్పలేను అని రంభ ఫేస్‌బుక్ పోస్టులో వెల్లడించింది.



Click it and Unblock the Notifications











