For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rambha Car Accident: హీరోయిన్ రంభ కారుకు ప్రమాదం.. ఆమె పరిస్థితి విషమం.. ఫొటోలు వైరల్

  |

  టాలీవుడ్‌లో తనదైన నటన, అందచందాలతో సందడి చేసి.. సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించిన నటీమణి రంభ. చాలా కాలం పాటు దక్షిణాది భాషల్లో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలను చేసిన ఈ భామ.. వివాహం తర్వాత కెరీర్‌కు బ్రేక్ ఇచ్చేసింది. ఆ తర్వాత భర్తతో కెనడాలో సెటిల్ అయింది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ప్రయాణిస్తోన్న కారుకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని రంభ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

   కెనడాలో ఫ్యామిలీతో సందడి

  కెనడాలో ఫ్యామిలీతో సందడి


  దక్షిణాది స్టార్ హీరోయిన్ రంభ.. శ్రీలంకకు చెందిన తమిళ బిజినెస్‌మ్యాన్‌ ఇంద్రకుమార్‌ను 2010, ఏప్రిల్ 10న వివాహం చేసుకుంది. ఆ తర్వాత అతనితో కలిసి కెనడాలో సెటిలైంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి పుట్టారు. అప్పటి నుంచి రంభ తన ఫ్యామిలీతోనే కలిసి ఎంజాయ్ చేస్తోంది. వీటికి సంబంధించిన ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో వదులుతోంది.

  శృతి మించిన అఖండ హీరోయిన్ హాట్ షో: వామ్మో గీత దాటేసిందిగా!

  రోడ్డు ప్రమాదానికి గురైన కారు

  రోడ్డు ప్రమాదానికి గురైన కారు


  సౌతిండియన్ స్టార్ హీరోయిన్ రంభ తాజాగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తన పిల్లలను స్కూల్ నుంచి తీసుకు వస్తున్న సమయంలోనే ఎదురుగా వస్తున్న కారును ఆమె ప్రయాణిస్తోన్న వాహనం ఢీకొట్టింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో రంభ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అలాగే, క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు.

   వాళ్లకు స్వల్పంగానే.. ఆమెకు

  వాళ్లకు స్వల్పంగానే.. ఆమెకు


  కెనడాలో రంభ ప్రయాణిస్తోన్న కారుకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమెతో పాటు పిల్లలు, నానమ్మ ఉన్నారు. వీళ్లందరికీ స్వల్ప గాయాలు అయినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఇక, ప్రమాదం జరిగిన వెంటనే రంభ ఫ్యామిలీ మెంబర్లను స్థానికులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.

  బోల్డు షోలో హద్దు దాటిన అనన్య నాగళ్ల: కుర్రాళ్లకు ఇది కదా అసలైన విందు

  ఫొటోలు షేర్ చేసి... రిక్వెస్ట్‌గా

  ఫొటోలు షేర్ చేసి... రిక్వెస్ట్‌గా


  యాక్సిడెంట్ తర్వాత హీరోయిన్ రంభ ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. 'ఇంటర్‌సెక్షన్ వద్ద మా కారుని మరో కారు వచ్చి ఢీకొట్టింది. కారులో నాతో పాటు పిల్లలు, నానమ్మ ఉన్నారు. అందరం స్వల్ప గాయాలతో బయటపడ్డాం. కానీ, షాషా ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోంది. బ్యాడ్ డేస్.. బ్యాడ్ టైమ్.. తను త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి' అని కోరింది

   ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది

  ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది


  రోడ్డు ప్రమాదంలో రంభ చిన్న కూతురు షాషాకే తీవ్ర గాయాలు అయినట్లు ఆమె స్వయంగా వెల్లడించారు. అయితే, ప్రస్తుతానికి ఆమె పరిస్థితి కూడా మెరుగు పడిందని తెలుస్తోంది. అయినప్పటికీ అక్కడి వైద్యులు షాషాకు మరింత మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారట. తాజా సమాచారం ప్రకారం.. ఆ చిన్నారి మరో రెండు మూడు రోజుల్లో కోలుకునే అవకాశం ఉందని టాక్.

  ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో శృతి హాసన్: లోపలివి కనిపించేలా ఘోరంగా!

  క్షేమంగా ఉండడానికి కారణం

  క్షేమంగా ఉండడానికి కారణం


  రంభ యాక్సిడెంట్‌కు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఎదురుగా వచ్చిన కారు అతి వేగంగా ఢీకొట్టిందట. అయితే, రంభ కారులో ఉన్న ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో బెలూన్స్ ఓపెన్ అయ్యాయని.. అందుకే ప్రాణనష్టం జరగలేదని అంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్, యాక్సిడెంట్ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

  రంభకు ఆఫర్లు.. నో చెప్పింది

  రంభకు ఆఫర్లు.. నో చెప్పింది

  సీనియర్ హీరోయిన్ రంభకు కొంత కాలంగా దక్షిణాది ఇండస్ట్రీల నుంచి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. కానీ, ఆమె మాత్రం ప్రస్తుతం సినిమాలు చేయలేనని వాటిని రిజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన దర్శక నిర్మాతలు కూడా ఆమెను సంప్రదించారని తెలిసింది. వాటిని కూడా రంభ తిరస్కరించినట్లు ఫిలిం నగర్‌లో ప్రచారం జరుగుతోంది.

  English summary
  Senior Actress Rambha met With Car Accident In Canada. She and Her Daughter was hospitalized with Injuries at hospital.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X