ఆ హీరోయిన్ కి నేనే తండ్రినంటూ కోర్టుకి
బెంగళూరు : నటి రమ్యకు నేనే తండ్రినంటూ బి.సి.వెంకటేష్ అనే వ్యక్తి సిటీ సివిల్ కోర్టులో శుక్రవారం అర్జీ వేసుకున్నారు. ఆమెకు నేనే తండ్రినంటూ చట్టబద్ధంగా ప్రకటించాలంటూ అర్జీలో విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ సభ్యురాలి(మండ్య లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెసు అభ్యర్థి), గా మారిన తరువాత ఆమె నన్ను తండ్రిగా ప్రకటించేందుకు నిరాకరిస్తున్నారు. అన్ని రికార్డుల్లో తాను రంజిత (రమ్య తల్లి) కుమార్తెగానే పేర్కొంటుందని వెంకటేష్ కోర్టుకు అందించిన అర్జీలో పేర్కొన్నారు.
రంజిత తన భార్య అనేందుకు ఆధారాల్ని కూడా కోర్టుకు సమర్పించానని తనను కలుసుకున్న విలేకరులకు వెంకటేష్ తెలిపారు. తనకు రంజితకు 1981 జూన్ 22వ తేదీన వివాహమైందని, సదాశివనగర ఐడియల్ నర్సింగ్‌హోంలో రమ్య 1982, నవంబరు 29న పుట్టిందని చెప్పారు. తాను పలుమార్లు కలుసుకునేందుకు ప్రయత్నించానని, ఎస్.ఎం.ఎస్.లు, ఫోన్‌ల ద్వారా ప్రయత్నించినా ఆమె స్పందించలేదన్నారు.

తాను రంజితను 2005లో కలుసుకునేందుకు ఆమె ఇంటికి వెళితే తల్లీ కుమార్తెలిద్దరూ తనను అవమానించి ఇంటికి పంపించారని అందుకే కోర్టులో కేసు వేశానని ఆయన తెలిపారు. ఈ వార్త కన్నడ మీడియాలో సంచలనమైంది. కొందరు ఇది ప్రతిపక్షాలు కుట్రగా అభివర్ణిస్తున్నారు. అయితే కేసు కోర్టులో ఉండటంతో స్పందించటానికి ఎవరూ ఆసక్తి చూపటం లేదు.


Click it and Unblock the Notifications











