యువ హీరోయిన్ బంగారం స్మగ్లింగ్.. ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసిన పోలీసులు
సినీ ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీలు తమ కెరీర్ ను ఎలా చక్కదిద్దుకోవాలని ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. అసలే ఇండస్ట్రీలో హిట్ పడకపోతే హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిందే. దాని కోసం హీరోయిన్లు ఎంతో క్రమశిక్షణగా, ఫుల్ ఫోకస్ తో అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. ఎంత సమయం పడినా పక్కదార్లు మాత్రం తొక్కబోరు. కానీ తాజాగా మాత్రం ఓ హీరోయిన్ ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు అక్రమ రావాణాకు పాల్పడింది. గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని ఆమెపై సాక్ష్యాధారాలతో కేసు కూడా నమోదు చేశారు. ఇప్పుడామె వార్త ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచనలంగా మారింది.
కన్నడ నటి రన్యా రావు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కానీ కన్నడిగులకు మాత్రం ఈ ముద్దుగుమ్మ సుపరిచతమే. కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ సరసన 'మానిక్య' అనే చిత్రంలో నటించింది. ఈ మూవీ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'మిర్చి'కి రీమేక్ గా తెరకెక్కింది. కన్నడలోనూ సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. అలాగే రన్యా రావుకు కూడా నటిగా మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత 'వాగ్', 'పటాకి' వంటి చాత్రల్లో మెరిసింది. ప్రస్తుతం కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి మాత్రం దూరంగా ఉంటోందీ ముద్దుగుమ్మ. దాదాపు ఎనిమిదేళ్లుగా ఎలాంటి ఆఫర్లు రావడం లేదు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉండే రన్యా రావు తాజాగా మాత్రం పోలీసులకు పట్టుబడి షాక్ ఇచ్చింది. ఏకంగా దొంగ రవాణా చేస్తూ ఎయిర్ పోర్ట్ లో పబ్లిక్ గా పోలీసుల చేతికి చిక్కింది. తాజాగా ఆమెపై కేసు నమోదైంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కన్నడ నటి రన్యా రావును బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో అరెస్ట్ చేశారు. 14.2 కిలోల గోల్డ్ ను దుబాయ్ నుంచి అక్రమ రవాణా చేసిందన్న ఆరోపణ మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఆమెను నిందను కన్ఫమ్ చేశారు. దాని విలువ రూ.12.56 కోట్ల పైగా ఉంటుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇక రన్యా రావు ఐపీఎస్ ఆఫీసర్ రామచంద్ర రావు స్టెప్ డాటర్ కావడం గమనార్హం.

దుబాయ్ ఎమిరేట్స్ నుంచి దొంగ రవాణాకు పాల్పడిన ఆమెను సోమవారం రాత్రే అదుపులోకి తీసుకున్నామని పోలీసు అధికారులు తెలుపుతున్నారు. కోర్టులో హాజరు పర్చగా.. ఆమెకు 14 రోజుల జ్యూడిషీయల్ కస్టడీకి అనుమతించిందని తెలిపారు. ఆమె తరుచూ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కు వెళ్తుండట ఎయిర్ పోర్టు సర్వేలైన్స్ లో రికార్డు అవుతూనే ఉందని, పోలీసులు గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. కేవలం 15 రోజుల్లోనే ఆమె నాలుగు సార్లు దుబాయ్ కి వెళ్లడంతో ఏదో చట్టవ్యతిరేక కార్యకాలాపాలకు పాల్పడుతున్నదని ఆమెపై అనుమానం వ్యక్తమైందన్నారు.
ఆమె టాప్ జాకెట్ లో, దుస్తుల్లో గోల్డ్ బార్స్ ను దాచి ఉంచిందని, పోలీసులు వాటిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఆమెపై 1962 యాక్ట్ కింద కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేశారు.14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ తర్వాత రన్యా రావుపై మరిన్ని చర్యలు తీసుకోనున్నారు. మున్ముందు మరిన్ని విషయాలను వెల్లడించనున్నారు.


Click it and Unblock the Notifications











