రాశీ ఖన్నా మొదటిసారి ఇంత బాగా చేసిందా?: రాశీఖన్నా ఫస్ట్ ఆడిషన్ (వీడియో)

Recommended Video

రాశీఖన్నా ఇంత బాగా చేసిందా ? ఫస్ట్ ఆడిషన్ వీడియో

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది రాశీఖన్నా. ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీలు చాలామంది మోడ‌లింగ్ రంగం నుండి వ‌చ్చినవారే! కొంద‌రు యాడ్స్ ద్వారా రాణిస్తే.. మోడ‌లింగ్‌లో టాలెంట్‌ క‌న‌బ‌రిచి వెండితెర‌పై ఓ వెలుగు వెలుగుతున్నారు. 30 ఏళ్ల రాశిఖన్నా.. "ఊహాలు గుస‌గుస‌లాడే" చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. త‌ను ఇండ‌స్ట్రీకి రాక‌ముందు ఆడిష‌న్ చేసిన వీడియో ఒక‌టి అభిమానుల‌ను ఎట్రాక్ట్ చేసుకుంటోంది..

 ఇంటర్మీడియట్‌ ఆలిండియా టాపర్‌

ఇంటర్మీడియట్‌ ఆలిండియా టాపర్‌

"సినిమాల్లోకి రాకముందు నా లోకమే వేరు. చదువు తప్ప మరొకటి ఉండేది కాదు. ఇంటర్మీడియట్‌లో నేను ఆలిండియా టాపర్‌ను. ఐఏఎస్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నా. అందుకే సినిమాలు కూడా ఎక్కువగా చూసేదాన్ని కాదు. ఎప్పుడూ పుస్తకాలతోనే జీవితం గడిపేదాన్ని.

 నా జీవితాన్ని మార్చేసింది

నా జీవితాన్ని మార్చేసింది

కానీ ఓ అనౌన్స్‌మెంట్ నా జీవితాన్ని మార్చేసింది. ఢిల్లీలో ఓసారి స్నేహితురాలితో కలిసి షాపింగ్‌మాల్‌కు వెళ్లా. ‘ఒక్క ఫొటో తీయించుకోండి.. మోడల్ అవ్వండి' అంటూ అక్కడ వ్యాజిలీన్ కంపెనీ వాళ్లు ఓ అనౌన్స్‌మెంట్ చేస్తున్నారు. అది విన్న నేను సరదా కోసం ఫొటో తీయించుకున్నా.

 మద్రాస్ కెఫె

మద్రాస్ కెఫె

ఆ తరువాత నాలుగు రోజులకు ఫెమినా మ్యాగజైన్ కవర్‌పేజీపై నా ఫొటో వచ్చింది. ఆ ఫొటో చూసి మోడలింగ్ చేయమని చాలా మంది అడిగారు. ఓ అమ్మాయి అయితే వెంటపడి మరీ ఒత్తిడితెచ్చింది. వీకెండ్స్‌లో చేద్దాంలే అనుకుని ఒప్పుకున్నా. డిగ్రీ చదువుతూనే అలా మూడేళ్లపాటు మోడలింగ్ చేశా. ఓ రోజు "మద్రాస్ కెఫె" నుంచి సినిమా ఆఫర్ వచ్చింది. ఆడిషన్ అవగానే సెలెక్ట్ అయ్యానని గతం లోనే చెప్పింది .

 సౌత్‌లో స్టార్ హీరోల స‌ర‌స‌న

సౌత్‌లో స్టార్ హీరోల స‌ర‌స‌న

ఈ మ‌ధ్య కాలంలో టాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌లు ప‌రాయి భామ‌ల‌కి రెడ్ కార్పెట్ వేస్తున్న సంగ‌తి తెలిసిందే. వేరే రాష్ట్రాల భామ‌లు సౌత్‌లో స్టార్ హీరోల స‌ర‌స‌న ఆఫ‌ర్స్ అందుకుంటూ టాప్ రేంజ్ కి వెళుతున్నారు. దీంతో కొంద‌రు భామ‌లు బాలీవుడ్ లోను అదృష్టం ప‌రీక్షించుకుంటున్నారు.

యాడ్స్ ద్వారా వెండితెర‌పైకి

యాడ్స్ ద్వారా వెండితెర‌పైకి

అయితే ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన భామ‌ల‌లో చాలా మంది మోడ‌లింగ్ రంగం నుండి వ‌చ్చిన వారే ఉన్నారు. కొంద‌రు యాడ్స్ ద్వారా వెండితెర‌పై న‌టించే అవ‌కాశం అందుకున్నారు. అయితే మోడ‌లింగ్‌లో మంచి ప్రావీణ్యం క‌న‌బ‌రిచి ప్ర‌స్తుతం వెండితెర‌పై ఓ వెలుగు వెలుగుతున్న అందాల రాశి రాశీ ఖ‌న్నా.

ఊహాలు గుస‌గుస‌లాడే

ఊహాలు గుస‌గుస‌లాడే

30 సంవ‌త్ప‌రాల ఈ భామ ఊహాలు గుస‌గుస‌లాడే చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత స్టార్ హీరోల సినిమాలు చేసింది. రీసెంట్‌గా జై ల‌వ‌కుశ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే సోష‌ల్ మీడియాలో రాశీకి సంబంధించిన ఓ వీడియో వైర‌ల్ అయింది.

ఇండ‌స్ట్రీకి రాక‌ముందు

త‌ను ఇండ‌స్ట్రీకి రాక‌ముందు ఆడిష‌న్ చేసిన వీడియో ఒక‌టి అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. రాశీ ఖ‌న్నా న‌టించిన ఆక్సీజ‌న్ చిత్రం ఈ రోజే విడుదలయ్యింది , ట‌చ్ చేసి చూడు, తొలి ప్రేమ అనే చిత్రాలు చేస్తుంది. ఇలా తొలినాళ్ళ వీడియో షరె చేసి మళ్ళీ జనాలని తనవైపుకు తిప్పుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X