»   » క్రికెటర్ బూమ్రాతో ఎఫైర్, పెళ్లి వార్తలపై స్పందించిన... రాశీ ఖన్నా!

క్రికెటర్ బూమ్రాతో ఎఫైర్, పెళ్లి వార్తలపై స్పందించిన... రాశీ ఖన్నా!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  RasiKanna Gives Clarity On Affairs

  తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళుతున్న హీరోయిన్ రాశి ఖన్నా ఇటీవల లవ్ ఎఫైర్, పెళ్లి వార్తలతో హాట్ టాపిక్ అయింది. క్రికెట్ బూమ్రా, రాశి ఖన్నా ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఆ వార్తల సారాంశం. ఈ వార్తలపై రాశి ఖన్నా తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో స్పందించారు.

  బూమ్రాను పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలపై

  బూమ్రాను పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలపై

  క్రికెటర్ బుమ్రాను పెళ్లి చేసుకుంటున్నారట నిజమేనా? అని అలీ ప్రశ్నించగా... రాశి ఖన్నా స్పందిస్తూ ‘ఈ ప్రశ్న అడిగినందుకు చాలా థ్యాంక్స్‌. అతను ఒక క్రికెటర్‌ అని మాత్రమే తెలుసు. అంతకుమించి ఏమీ లేదు. అతని మ్యాచ్‌లు అస్సలు ఎప్పుడూ చూడలేదు. వ్యక్తిగా అతనెవరో కూడా తెలియదు.' అని రాశీ ఖన్నా తెలిపారు.

  నాపై వారే ఈ వార్తలు పుట్టించారు

  నాపై వారే ఈ వార్తలు పుట్టించారు

  బూమ్రా గురించి నాపై ఈ రూమర్‌ ఎలా వచ్చాయో తెలియదు. కొన్ని హిందీ వెబ్‌సైట్‌లు చేసిన పని ఇది. ఇలాంటివి వింటుంటే చాలా చిరాగ్గా ఉంటుంది.... అని రాశీ ఖన్నా తెలిపారు.

  మెగా హీరోతో లవ్‌లో ఉన్నారా?

  మెగా హీరోతో లవ్‌లో ఉన్నారా?

  ఒక మెగాహీరోతో కూడా లవ్‌లో ఉన్నారని అంటున్నారు.. నిజమేనా? అంటూ అలీ మరో ప్రశ్న సంధించగా.... ఎక్కడి నుంచి రాస్తారండీ ఇవన్నీ. ఎవరా హీరో మీరు చెప్పండి అంటూ అలీని ఎదురు ప్రశ్నించింది రాశీ.

  చాలా మంది బాయ్ ఫ్రెండ్స్

  చాలా మంది బాయ్ ఫ్రెండ్స్

  సాధారణంగా హీరోయిన్లు ఒకరికొకరు ఫ్రెండ్స్‌ అవుతారు? కానీ రాశీఖన్నాకు హీరోల్లో ఎక్కువ ఫ్రెండ్స్‌ ఉన్నారట నిజమేనా? అనే ప్రశ్నకు రాశీ ఖన్నా స్పందిస్తూ.... అవును! అది నిజమే. గర్ల్స్‌.. బాయ్స్‌ ఎక్కువమందే ఉంటారు. దిల్లీలో కూడా నాకు చాలామంది బాయ్‌ఫ్రెండ్స్‌ ఉన్నారు. రకుల్‌ నాకు చాలా క్లోజ్‌. నా సహ నటులతో చాలా క్లోజ్‌గా ఉంటాను అని సమాధానం ఇచ్చారు.

  ఆ సినిమా ఎందుకు చేశానా? అనిపించింది

  ఆ సినిమా ఎందుకు చేశానా? అనిపించింది

  ఇప్పటి వరకు 15 సినిమాల్లో నటించాను. అయితే అందులో ఒక సినిమా చేసిన తర్వాత ‘ఎందుకు ఈ సినిమా చేశానా?' అనిపించింది. ఆ సినిమా పేరు నేను చెప్పను. కథ చెప్పినప్పుడు బాగా అనించింది. కానీ సినిమా తెరపై చూసుకున్న తర్వాత బాధ పడ్డాను అని... రాశీ ఖన్నా తెలిపారు.

   English summary
   Actress Rashi Khanna said am not love with Jaspreet Bumrah. Raashi Khanna is an Indian actress and model who predominantly acts in the Telugu film industry. She debuted as an actress with the Hindi film Madras Cafe and made her debut in Telugu with the successful Oohalu Gusagusalade.
    

   తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more