Bomma Blockbuster event ఆయనతో 14 ఏళ్ల జర్నీ.. ఎప్పటి వరకు ప్రయాణమో.. రష్మీ గౌతమ్ ఎమోషనల్
టాప్ యాంకర్, నటి రష్మీ గౌతమ్, నందూ విజయ్ కృష్ణ జంటగా మనోహర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి మద్ది, బోసుబాబు నిడుమోలు, ప్రవీణ్ పగడాల నిర్మాతలుగా రాజ్ విరాట్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. ఈ చిత్రం నవంబర్ 4న రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నాగశౌర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో రష్మీ గౌతమ్ మాట్లాడుతూ..

నాగశౌర్యకు ధన్యవాదాలు
అందరికి నమస్కారం. రెండు గంటలపాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకొన్నాం. కానీ అందరూ మాట్లాడటంతో చాలా సేపు జరిగింది. చాలా ఓపికగా ఈవెంట్‌ను చూసిన ప్రతీ ఒక్కరికి, ముఖ్య అతిథిగా వచ్చిన నాగశౌర్యకు నా ధన్యవాదాలు. నాగశౌర్య ఇలాంటి సపోర్ట్ ఇస్తానని నందూ, నేను ఊహించలేదు అని రష్మీ గౌతమ్ అన్నారు.

చిన్న సినిమాకు థియేటర్లు దొరకడమే..
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా ప్రమోషన్స్‌కు సమయం సరిపోలేదు. చిన్న సినిమాకు కనీసం 20 రోజులు ఉండాలి. మాకు కనీసం వారం రోజులే సమయం చిక్కింది. కొన్ని కారణాల వల్ల, సినిమా నవంబర్ 4 తేదీన రిలీజ్‌కు డేట్ దొరికింది. చిన్న సినిమాకు థియేటర్లు దొరకడమే కష్టం. రిలీజ్ డేట్ దొరకడంతో సినిమాను విడుదల చేయాలని చకచకా ప్లాన్ చేశాం. ఈ సినిమాను నేను హోస్ట్‌గా చేసే షోలోనే ప్రమోషన్ చేయలేకపోయాను అని రష్మీ గౌతమ్ అన్నారు.

మా సినిమా చూడటానికి రండి..
సినిమా ఫేట్.. శుక్ర, శని, ఆదివారాలే. ఈ మూడు రోజుల్లోనే సినిమా భవితవ్యం తేలిపోతుంది. కోవిడ్ తర్వాత పరిస్థితులు చాలా మారిపోయాయి. కాబట్టి మా బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ అవుతున్నందున్న మా సినిమా చూడటానికి ప్లాన్ చేసుకోండి. ఒకవేళ ప్లాన్ చేసుకోకపోతే.. మా సినిమాను చూడటానికి రండి. మూడ్ తెచ్చుకొని మా సినిమా చూడండి అని రష్మీ గౌతమ్ అన్నారు.

కొత్తవాళ్లందరూ ప్రాణం పెట్టి
నందూతో నా ప్రయాణం 14 ఏళ్లు. మా జర్నీ ఎన్నాళ్లు ముందుకు సాగుతుందో తెలియదు. కానీ బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాకు చాలా మంది కొత్తవాళ్లు ప్రాణం పెట్టి పనిచేశారు. వర్థమాన నటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకొన్నారు. కాబట్టి ఈ సినిమాను తప్పకుండా థియేటర్లలో చూడండి.. ఈ సినిమాకు కలెక్షన్లు బెటర్‌గా వస్తే.. మరో 50 లక్షలు పెట్టి మంచి సినిమా చేయడానికి మా నిర్మాత ముందుకు వస్తాడు. దాంతో సినిమా పరిశ్రమకు మంచి జరుగుతుంది అని రష్మీ గౌతమ్ అన్నారు.

కొత్తవారికి బ్రేక్ ఇవ్వండి..
కొత్తవాళ్లతో కలిసి నందూ, మా నిర్మాత బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా ద్వారా ఒక వేదికను ఇచ్చారు. ఆ వేదిక మీదకు వచ్చిన కొత్త టాలెంట్‌ను ఆదరించి.. నిలబెట్టే బాధ్యత ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది. కాబట్టి కొత్త వారికి బ్రేక్ ఇవ్వండి.. ఈ సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరికి బ్రేక్ రావాలని కోరుకొంటున్నాం. ఈ సినిమాను ప్యాషన్‌తో చేశాం. కొత్తవాళ్లు చాలా కష్టపడ్డారు. ఫ్రైడే ఫస్ట్ షో టాక్ మాకు చాలా ఇంపార్టెంట్. నందూ, నా ఫేట్ పక్కన పెట్టి.. చిన్న సినిమాలు, కొత్తగా వచ్చిన వారికి అవకాశం ఇవ్వండి అని రష్మీ గౌతమ్ ఎమోషనల్ అయ్యారు.


Click it and Unblock the Notifications











