Rashmika Mandanna : వాళ్లకి రష్మిక మందన్న క్షమాపణలు.. వదిలేయండి అంటూ రిక్వెస్ట్
ప్రస్తుతం దేశం మొత్తం ఏలేస్తున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. గతేడాది యానిమల్, ఇప్పుడు పుష్ప 2 చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ ఇండస్ట్రీ హిట్లతో షేక్ చేస్తున్నారు ఈ కన్నడ కస్తూరి. రష్మిక ఉంటే కలెక్షన్ల వర్షం గ్యారెంటీ అంటూ లక్కీ హ్యాండ్ అనిపించుకుంటున్నారు. అందాల ఆరబోతే కాదు.. నటనలోనూ తనకు తిరుగులేదని నిరూపించారు. తద్వారా ఇప్పుడు బాలీవుడ్ భామలను మించిన క్రేజ్‌తో ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా నిలిచారు రష్మిక మందన్న.
కిరాక్ పార్టీతో సినీరంగ ప్రవేశం చేసిన రష్మిక మందన్న తొలుత చిన్నా చితకాత పాత్రలతో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు ఈ స్థాయికి చేరారు. తన దృష్టి పూర్తిగా తెలుగు చిత్ర పరిశ్రమపై పెట్టిన రష్మక మందన్న.. చలో, గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి సినిమాలతో క్రేజ్ సంపాదించుకున్నారు. తర్వాత బాలీవుడ్‌ను ఓ చూపు చూసిన ఆమె బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన గుడ్ బాయ్ మూవీలో ఛాన్స్ దక్కించుకున్నారు. ఇక గతేడాది రిలీజైన యానిమల్‌తో రష్మిక రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.

తాజాగా పుష్ప 2లో హీరోనే డామినేట్ చేసే నటనతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా ఫార్మాట్‌లో తెరకెక్కుతోన్న కుబేరతో పాటు హిందీలో చావా, సికిందర్, థమ, ది గర్ల్ ఫ్రెండ్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో రష్మిక మందన్న నటిస్తున్నారు. హీరోయిన్‌గా స్టార్‌డమ్ సంపాదించినప్పటికీ పలు కాంట్రవర్సీలలో ఆమె ఇరుక్కున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
తనకు బాగా ఇష్టమైన సినిమా గిల్లి అని.. తాను థియేటర్‌లో మొదటిసారి చూసిన సినిమా దళపతి విజయ్‌ది కావడంతో ఎప్పటికీ ఆయన నా ఫేవరేట్ హీరోగా మారిపోయాడని రష్మిక అన్నారు. అక్కడితో ఆగితే ఏ సమస్యా ఉండేది కాదు.. కానీ ఇది తెలుగులో మహేశ్ నటించిన పోకిరికి రీమేక్ అనేసింది. నిజానికి గిల్లి.. పోకిరికి రీమేక్ కాదు దాని ఒరిజనల్ వెర్షన్ తెలుగులో మహేశ్ హీరోగా వచ్చిన ఒక్కడు. దీంతో సూపర్‌స్టార్ అభిమానులు రష్మికపై ట్రోలింగ్‌కు దిగారు. ఓ స్టార్ హీరోయిన్ అయ్యుండి కనీస సినిమా నాలెడ్జ్ లేకపోవడం ఏంటంటూ మండిపడుతున్నారు.
Avunu .. telusu sorry.. okka booboo aipoindi.. 🐒 interview ayipointarvata annukunna reyyyy ghilli is okkadu ra .. pokkiri is pokiri ani.. 🤦🏻♀️ social media lo ippudu estuntaaru ani.. sorry sorry my bad.. but I love all of their movies so it’s ok. 🐒
— Rashmika Mandanna (@iamRashmika) December 21, 2024
ఈ ట్రోలింగ్ దెబ్బకు రష్మిక స్పందించింది. ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేసింది. '' ఇంటర్వ్యూ అయ్యాక గానీ నాకు గుర్తురాలేదు.. సారీ.. గిల్లి సినిమా ఒక్కడు రీమేక్ అని.. పోకిరి మూవీని అదే పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. కానీ అప్పటికే నా మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. సారీ.. సారీ.. మై బ్యాడ్.. కానీ నాకు వాళ్లు నటించిన అన్ని సినిమాలు ఇష్టమే '' నంటూ రష్మిక సున్నితంగా వివాదానికి చెక్ పెట్టేసింది. మరి దీనిపై మహేశ్ అభిమానులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











