రక్తం కారుతున్నా ఓర్చుకుని .. ‘ పీలింగ్స్ ’ సాంగ్ షూటింగ్ , షాకింగ్ న్యూస్ బయటపెట్టిన రష్మిక

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ ఎన్నో సంచలనాలు సృష్టిస్తోంది. కలెక్షన్లతో పాటు అదే స్థాయిలో వివాదాలు కూడా ఈ సినిమా చుట్టుముడుతున్నాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్, విడుదల.. తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఇలా పుష్ప 2 దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఇకపోతే.. ఈ సినిమాతో నేషనల్ క్రష్ రష్మిక మందన్న టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. పుష్ప 2 విజయంలో అల్లు అర్జున్‌తో పాటు రష్మిక కూడా కీలకపాత్ర పోషించారు. ఆమె పోషించిన శ్రీవల్లి క్యారెక్టర్ లైఫ్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిపోతుందని విశ్లేషకులు అంటున్నారు. భర్త అంటే ప్రాణం ఇచ్చే ఇల్లాలిగా , ఆయనపై ఈగ వాలనివ్వని క్యారెక్టర్‌లో రష్మిక అద్భుతంగా నటించారు. ఇక తన గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో రష్మిక గ్లామర్ డోస్ పెంచేశారు. చీరకట్టులో పద్ధతిగా కనిపిస్తూనే రొమాంటిక్ సీన్స్‌లో రెచ్చిపోయింది.

Actress Rashmika Mandanna reveals Allu Arjun got injured and bleeding during the shoot of Peelings song

గతేడాది యానిమల్, ఈ ఏడాది పుష్ప 2లతో దాదాపు రూ.2500 కోట్ల వసూళ్లు సాధించిన చిత్రాలలో నటించిన హీరోయిన్‌గా రష్మిక అరుదైన ఘనత సాధించారు. పుష్ప 2 ఘన విజయంతో ఆమె టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా నిలిచారు. అంతేకాదు.. రష్మిక పారితోషికం కూడా బాగా పెంచేసినట్లు ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పుష్ప 2 సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న రష్మిక మందన్న.. టాలీవుడ్ టూ బాలీవుడ్ వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తోంది.

తాజాగా ఓ హిందీ వెబ్‌సైట్ బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఎక్స్‌క్లూజిక్ ఇంటర్వ్యూలో రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఇప్పుడు అందరి నోట్లో నానుతోన్న పీలింగ్ సాంగ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పాట చేసే సమయంలో తనకు అసౌకర్యంగా అనిపించిందని ఆమె అన్నారు. నన్ను ఎవరైనా అమాంతం పైకి ఎత్తితే తనకు చాలా భయమని.. ఇది నాకున్న ఫోబియా అని రష్మిక చెప్పారు. అయితే చిత్రీకరణలో భాగంగా అల్లు అర్జున్ నన్ను ఎత్తుకుని బాటిల్‌తో డ్యాన్స్ చేసినప్పుడు చాలా భయపడ్డానని ఆమె గుర్తుచేసుకున్నారు.

ఇక ఇదే ఇంటర్వ్యూలో మరో సంచలన విషయాన్ని రష్మిక మందన్న బయటపెట్టారు. పీలింగ్స్ సాంగ్ 4 నుంచి 5 రోజుల పాటు చిత్రీకరించారని.. ఆ సమయంలో విపరీతమైన ఒత్తిడితో పాటు బాగా రిహార్సల్స్‌ చేశామన్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో అల్లు అర్జున్ తనకు ఎంతో సాయం చేశారని.. ఓ రోజున డ్యాన్స్ చేస్తుండగా నా కంకణాలు, గాజులు ఆయన చేతికి తగిలి రక్తస్రావం అవుతోందని ఆమె తెలిపారు. నాకు బాధగా అనిపించి ఆయన చేతిని లాగి.. సార్ సార్ అని పిలుస్తూ బాండేజ్ కట్టానని రష్మిక వెల్లడించారు. ఇంత జరిగినా అల్లు అర్జున్ డ్యాన్స్ చేస్తూనే ఉన్నారని.. ఇలాంటివి సహజమేనని తిరిగి పనిలో పడిపోయారని , కానీ నా వల్ల మీరు బాధపడటం నాకు ఇష్టం లేదని ఆయనకు చెప్పినట్లు రష్మిక చెప్పారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X