దూరంగా ఉండాలనుకొన్నా.. అందుకే గుడ్‌బై చెప్పాను.. రష్మిక మందన్న క్లారిటీ!

Recommended Video

Actress Rashmika Mandanna Drop Outs From Kannada Movie

వరుస సినిమాలు, విజయాలతో పరుగులు పెడుతున్న రష్మిక మందన్న కెరీర్, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన నిర్ణయాలను చకచకగా తీసేసుకొంటున్నారు. కెరీర్ కోసం రక్షిత్‌శెట్టితో ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేసుకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ కన్నడ చిత్రం నుంచి ఆమె తప్పుకొన్న వార్తలు రావడంతో ఆ విషయాన్ని రష్మిక ధృవీకరించారు. ఆమె ఏమన్నారంటే..

ఫ్యాన్స్‌కు గణేష్ పండుగ విషెస్

ఫ్యాన్స్‌కు గణేష్ పండుగ విషెస్

అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు. పండుగను ఘనంగా జరుపుకొని ఉంటారు అని అనుకొంటున్నాను. అందరికీ మంచి జరుగాలని కోరుకొంటున్నాను అని రష్మిక వెల్లడించింది.

వ్రిత్రాలో నటించకూడదని

వ్రిత్రాలో నటించకూడదని

అలాగే ట్విట్టర్‌ ద్వారా ఓ ముఖ్యమైన విషయాన్ని వెల్లడించాలని మీ ముందుకు వచ్చాను. కన్నడలో నేను వ్రిత్రా అనే చిత్రంలో నటించాలనుకొన్నాను. కానీ ప్రస్తుతం సినిమాలో నటించకూడదని అనుకొన్నాను అని ట్వీట్‌లో రష్మిక తెలిపారు.

ఆ పాత్ర చేయవద్దని

కెరీర్ ఆరంభంలో వ్రిత్రా చిత్రంలో నటించడం సబబు కాదని అనుకొంటున్నాను. ఈ చిత్రాన్ని చేయాలా? వద్దా అని చాలా రోజులు ఆలోచించాను. అయితే సినిమాను చేయడం లేదని డైరెక్టర్, నిర్మాతకు వెల్లడించాను. నా రిక్వెస్ట్‌ను వారు సానుకూలంగా అర్ధం చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది అని రష్మిక తెలిపింది.

రక్షిత్ శెట్టి ఫ్రెండ్ కావడం వల్లే

రక్షిత్ శెట్టి ఫ్రెండ్ కావడం వల్లే

వ్రిత్రా ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రకు రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ పాత్రలో మరొకరు బ్రహ్మండంగా రాణిస్తారని అనుకొంటున్నాను. డైరెక్టర్ గౌతమ్, చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ అని అన్నారు. అయితే వ్రిత్రా డైరెక్టర్ గౌతమ్, రక్షిత్ శెట్టి క్లోజ్ ఫ్రెండ్స్ కావడం వల్లనే సినిమా నుంచి తప్పుకొన్నట్టు కన్నడ మీడియా కథనాన్ని వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X