షూటింగ్ లో రక్తం వాంతి చేసుకుంది...వర్మ
ఆవిడ నాతో పనిచేసిన ఆర్టిస్టులలో బెస్ట్ అని చెప్పగలను.అలాగే చాలా కమిట్ మెంట్ ఉన్న ఆవిడ కూడా. నా తాజా చిత్రం నాటే ఎ లవ్ స్టోరీ లో ఆమె నీరజ్ తల్లిగా చేసింది. అప్పటికే కాన్సర్ చివర స్టేజీలో ఉంది. సెట్స్ మీదే బ్లడ్ వాంతి చేసుకుంది. అయినా లాస్ట్ షాట్ పూర్తి చేసేదాకా అదే కమిట్మెంట్ తో పనిచేసింది అంటూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాన్సర్ తో నిన్న(గురువారం) మరణించిన రసికా జోషి(39) గురించి రాసుకొచ్చారు. ఇక రసిక బిల్లూ, డర్నా జరూరి హై, ఏక్ హసీనా ధీ, బూల్ బులయ్యా వంటి అనేక బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. చాలా కాలంగా కాన్సర్ తో పోరాడుతున్న ఆమె నిన్న ముంబైలోని నర్సింగ్ హోమ్ లో మరణించింది. ఆమె పేరు పొందిన మరాఠి ధియోటర్ ఆర్టిస్టు.


Click it and Unblock the Notifications











