తల్లి కాబోతున్న 'మనసంతా నువ్వే' హీరోయిన్

By Srikanya

న్యూడిల్లీ: తేజ దర్శకత్వంలో రూపొందిన 'చిత్రం'తో తెరంగేట్రం చేసిన నటి రీమాసేన్‌. 'మనసంతా నువ్వే', 'వీడే', 'బావనచ్చాడు' లాంటి చిత్రాలతో రీమా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఆ తరవాత ఎక్కువ తమిళ చిత్రాలపై దృష్టి కేంద్రీకరించింది. గతేడాది ఆమె ఢిల్లీకి చెందిన శివ్‌కరణ్‌ సింగ్‌ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకొంది. రీమా తల్లి కాబోతోందని ఆమె సన్నిహితుల ద్వారా తెలిసిన సమాచారం. ప్రస్తుతం రీమా ఢిల్లీలోనే ఉన్నారనీ, వచ్చే యేడాది మార్చిలో ప్రసవమవుతుందని తెలిసింది.

ఇక ఆమె భర్త శివకు ఢిల్లీలో మోచ్చా, స్మోక్ హౌస్ వంటి అనేక రెస్టారెంట్లు ఉన్నారు. రీమాసేన్ సినిమాల విషయానికి వస్తే ఆమెకు మనసంతా నువ్వే చిత్రం తర్వాత తెలుగులో పెద్ద హిట్టు ఒకటీ పడలేదు. రీసెంట్ గా కూడా వియన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ముగ్గురులో ఓ కీ రోల్ ని చేసింది. ఆ సినిమాను ఫెయిల్యూర్ అవ్వటంతో ఆమెను పట్టించుకున్నవాళ్లు లేరు. తమిళంలోనూ యుగానికి ఒక్కడు వంటి పెద్ద సినిమాలు చేసినా అక్కడా క్రేజ్ లేకుండా పోయింది. దాంతో ఆమె బెంగాళికి వెళ్లి అక్కడ కొన్ని సినిమాలు చేసింది. ఆమె బెంగాళీలో చేసిన ఓ సినిమాను ఆ మధ్యన తమిళంలో డబ్ చేసి విడుదలకు ప్లాన్ చేసినప్పుడు రాంగ్ పబ్లిసిటీ చేస్తున్నారంటూ ఆమె గొడవలు కూడా చేసింది.

అప్పట్లో సినిమా పబ్లిసిటీ కోసం నా మార్ఫింగ్ చేసి నా నగ్న చిత్రాలను మార్కెట్లో విడుదల చేసారు..ఆ నిర్మాతలను వదిలిపెట్టను.. కేసు వేస్తాను... మా లాయిర్ తో సంప్రదింపులు జరుపతున్నా అంది రీమాసేన్. ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా 'ఇతి శ్రీకాంత'అనే బెంగాళి సినిమాలో చేసింది.ప్రఖ్యాత బెంగాలీ రచయిత శరత్‌ రాసిన నవల ఆధారంగా ఆ చిత్రం రూపుదిద్దుకొంది. ఇతి శ్రీకాంతను ఇప్పుడు తమిళంలో అనువదిస్తున్నారు.అంజన్‌దాస్‌ దర్శకత్వం వహించారు. జాతీయ స్థాయిలో రెండు పురస్కారాలు కూడా వచ్చాయి.అందులో రీమా చేసింది చిన్న పాత్రే అయినా, తమిళ ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి పోస్టర్ల నిండా రీమానే శృంగార భంగిమలతో వేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X