స్వయం ప్రకటిత సారూ.. మీ తాత జనానికి గుర్తున్నాడంటే , అల్లు అర్జున్‌పై హీరోయిన్ ఘాటు విమర్శలు

అల్లు అర్జున్ తీరుతో మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఆయన మాటలు కాంట్రవర్సీ అవుతున్నాయో లేక కాంట్రవర్సీ అవ్వాలని మాట్లాడుతున్నారో తెలియడం లేదు కానీ ఆయన మైక్ అందుకుంటే చాలు మెగా ఫ్యాన్స్ భయపడుతున్నారు. చాన్నాళ్ల కిందటి నుంచి అల్లు అర్జున్‌ను మెగా ఫ్యామిలీలో ఒకరిగా చూడటం మానేశారు మెగా ఫ్యాన్స్. బన్నీ కూడా అందరికీ అభిమానులుంటే.. తనకు ఆర్మీ ఉందని చెప్పడం కూడా వాళ్లను మండించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాతి నుంచి అల్లు అర్జున్‌కు మెగా ఫ్యామిలీకి ఉన్న గ్యాప్‌పై అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మెగా కాంపౌండ్‌తో క్లోజ్‌గా ఉన్న దాఖలాలేవి కనిపించడం లేదు. పవన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లలేదు, చిరు పుట్టినరోజు నాడు సింగిల్ లైన్‌లో పోస్ట్ పెట్టి మమ అనిపించాడు.

ఇలాంటి దశలో రావు రమేశ్ హీరోగా నటించిన మారుతీ నగర్ సుబ్రమణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. డైరెక్టర్ సుకుమార్ సతీమణి ఈ మూవీకి సమర్పకురాలిగా వ్యవహరించడంతో ఆ ఫ్యామిలీతో ఉన్న బాండింగ్ నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి వచ్చారు. అయితే ఈ ఈవెంట్‌లో బన్నీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మనసుకు ఇష్టమైన వారికి మన సపోర్ట్‌ను చూపించాలి, నాకు ఇష్టమైతే వస్తా, నా మనసుకు నచ్చితే వస్తా అంటూ వ్యాఖ్యానించారు. మెగా ఫ్యామిలీని ఉద్దేశించే అల్లు అర్జున్ ఇన్‌డైరెక్ట్‌గా చేశారంటూ మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు.

actress rekha boj sensational comments on icon star allu arjun over his speech at maruthi nagar Subramanyam pre release event

తాజాగా అల్లు అర్జున్‌పై విమర్శలు చేశారు జనసైనికురాలు, సినీనటి రేఖా భోజ్. మాంగళ్యం, దామిని విల్లా, రంగేలా, కళ్యాణ తస్మై నమ: వంటి సినిమాలలో రేఖ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆస్తుల్ని, తను సంపాదించిన మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి విశాఖపట్నంలో సొంతంగా స్టూడియో పెట్టుకుని కవర్ సాంగ్‌లు, వీడియో ఆల్బమ్స్ చేస్తూ రేఖ ఫేమస్ అయ్యారు. ఆమె అసలు పేరు శ్రీసుష్మ. అన్నింటిలోకి టీమిండియా ప్రపంచకప్ గెలిస్తే విశాఖ బీచ్‌లో స్ట్రీకింగ్ చేస్తానంటూ సంచలన ప్రకటన చేసి దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు రేఖ వీరాభిమాని పిఠాపురంలో విస్తృతంగా ప్రచారం చేసింది. తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు దక్కడం లేదంటూ గళం విప్పిన ఆమె.. తన పేరును శ్రీసుష్మకు బదులు రేఖా భోజ్‌గా మార్చుకుంది.

అల్లు అర్జున్‌ వ్యాఖ్యలపై ఆమె ఫేస్‌బుక్ ద్వారా స్పందించింది. '' అంతలా ఎగిరిపడకండి సార్.. స్వయం ప్రకటిత సార్.. టాలీవుడ్‌లో ఎందరో కమెడియన్లు కనుమరుగయ్యారు. వీరి గురించి ఈ జనరేషన్ పిల్లలని అడిగితే తెలియదంటరూ.. కానీ అల్లు రామలింగయ్య గురించి అడిగితే 90 శాతం తెలుసంటారు. అల్లు వారసుడు అల్లు అరవింద్, ఆయన మనవళ్లు ఓ రేంజ్‌లో ఉన్నారు. ఎందుకు.. ఇప్పుడు చెప్పండి, ఎవరి లైఫ్‌లోకి ఎవరు వస్తే ఎవరి జీవితాలు బాగుపడ్డాయో.. ఆయన మీతో చుట్టరికం చేయడమే కాకుండా ఎలాంటి పక్షపాతం లేకుండా పవన్, చరణ్‌లతో పాటుగా తన లెగసీని పంచాడు.''

'' మీరు నిలబడేదాక మీతో వారు నిలబడ్డారు.. మీ ఫంక్షన్స్ అన్నింటికీ చిరంజీవి, పవన్ వచ్చారు. చిరంజీవి మొహం చూసి ఆయన కుటుంబం, ఆయనను ప్రాణంగా భావించే ఫ్యాన్స్ కూడా మీకు సపోర్ట్‌గా.. మావోడు అని నిలబడ్డారు. మీరేమే ఆయనతో, ఆయన అభిమానులతో వ్యాపారం చేశారు. మెగాస్టార్ అనేవాడు లేకపోతే మీరంతా ఎక్కడ ఉండేవారో .. మిగిలిన కమెడియన్స్ వారసులను చూసి తెలుసుకోండి.. వారిలాగా మీ పేర్లు, అడ్రస్‌లు మాకు ఈరోజున తెలిసి ఉండేవి కావు. ఈ పోస్ట్‌ను ఎవరినీ కించపరచడానికి రాయలేదు.. జస్ట్ ఫాక్ట్స్ చెప్పాలనే రాశానంటూ '' రేఖా భోజ్ రాసుకొచ్చింది ''.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X