అనారోగ్య సమస్యతో బాధపడుతున్న రేణుదేశాయ్.. కష్టంగా ఉందంటూ షాకింగ్ పోస్ట్
ఇటీవల కాలంలో కొంతమంది సినిమా స్యార్స్ వారికి సంబంధించిన కొన్ని అనారోగ్య సమస్యల గురించి కూడా ధైర్యంగా బయటికి చెబుతున్నారు. ఇక ఎంతో చలాకీగా నవ్వుతూ కనిపించే రేణు దేశాయ్ కూడా తనకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ నోట్ తో వివరణ ఇచ్చారు. ఇక ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను అనే విషయంలో కూడా ఆమె ఒక అర్థవంతమైన క్లారిటీ ఇచ్చారు. ఆమె ఏం చెప్పింది అనే వివరాల్లోకి వెళితే...

సినిమాల్లో మళ్ళీ..
పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ ప్రస్తుతం పూణేలో ఉంటున్న విషయం తెలిసిందే. ఆమె కుమారుడు కూతురు ఇద్దరితో కూడా ఆమె జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇక అప్పుడప్పుడు ఆమె పలు ఇంటర్వ్యూలతో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పుడు సరికొత్తగా మళ్ళీ సినిమాల్లో కూడా నటిగా బిజీ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

అనారోగ్య సమస్యలతో..
రేణు దేశాయ్ ఎప్పుడూ కూడా తన పిల్లలకు సంబంధించిన అప్డేట్స్ తో సోషల్ మీడియాలో ఫాన్స్ కు ఎంతగానో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు. అయితే ఆమె ఈసారి ఊహించని విధంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా ఒక పోస్ట్ వేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అందులో ఆమె ఏమాత్రం నిరాశ చెందకుండా స్ఫూర్తినిచ్చే విధంగా వివరణ కూడా ఇచ్చారు.

కష్టంగా ఉంటుంది
నేను గత కొన్ని సంవత్సరాలుగా గుండె మరియు కొన్ని అనారోగ్య సమస్యలతో కొనసాగుతున్నాను అంటూ ఆ విషయం గురించి నాకు దగ్గరగా ఉండే నా ప్రియమైన వారందరికీ కూడా తెలుసు అని అన్నారు. కొన్నిసార్లు వాటిని అర్థం చేసుకొని శక్తిని పెంపొందించుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అని చాలా ఎమోషనల్ గా వివరణ ఇచ్చారు.

ఆశను కోల్పోవద్దు
అయితే ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు తెలియజేస్తున్నాను అంటే.. నాకంటే చాలామంది ఇతర ఎన్నో సమస్యలతో పోరాడుతున్నారు. వారందరికీ గుర్తు చేయడానికి ఈ విధంగా చెబుతున్నాను. మనం ఎలాగైనా బలంగా ఉండాలి మన మీద మనకు ఎంతో విశ్వాసం ఉంచుకోవాలి. ఎప్పుడూ కూడా జీవితంపై ఆశను కోల్పోవద్దు. మన కోసం ఏదో ఒక తీపి అంశాన్ని జీవితం మనకు అందిస్తుంది అంటూ అందరూ నవ్వండి అని ఆమె ఒక అందమైన కొటేషన్ గురించి కూడా తెలియజేశారు.

త్వరగా కొలుకోవాలి అని..
అంతేకాకుండా రేణు దేశాయ్ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్లు కూడా తెలియజేశారు. మందులు యోగా పోషకాహారం మొదలైనవి కొనసాగుతున్నాయి అంటూ నేను సాధారణ జీవితానికి తిరిగి రావాలి అని అలాగే త్వరలో షూటింగ్ కి రావాలి అని ఆశిస్తున్నట్లుగా రేణు దేశాయ్ వివరణ ఇచ్చారు. ఇక ఆమె త్వరగా కోలుకోవాలని కూడా ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

నటిగా మళ్ళీ బిజీగా
ఇక రేణు దేశాయ్ పోస్ట్ చేసిన ఫోటోలో కూడా ఆమె ఒక ప్రత్యేకమైన యంత్రాన్ని గుండె దగ్గర పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక రేణు దేశాయ్ ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె ఇప్పటికే రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ఇటీవల పూర్తయింది. త్వరలోనే ఆమె మరి కొన్ని సినిమాల్లో నటించబోతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











