Don't Miss!
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Sports చరిత్ర సృష్టించిన ధోనీ.. ఒకే ఒక్కడు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రేవతి నటించిన తెలుగు చిత్రం 'ఎల్లమ్మ' రిలీజ్ డేట్
విలియమ్ షేక్స్పియర్ రచించిన మేక్బెత్ ఆధారంగా తెలుగులో 'ఎల్లమ్మ' చిత్రాన్ని నిర్మించారు. నాజర్, రేవతి, సొనాలికులకర్ణి, భూపాల్‌రెడ్డి ఇందులో ముఖ్యపాత్రధారులు. అంతర్జాతీయ స్థాయి దర్శకుడు గౌతమ్‌ఘోష్ వద్ద పలు చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేసిన కి.శే. మోహన్కోడా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మ్యాజిక్లాంటర్న్ కమ్యూనికేషన్స్ పతాకంపై వేముగంటి హరహరరావు సమర్పమలో నిర్మించిన ఈ చిత్రం ఇదే నెల 24న విడుదలవుతుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.రామ్‌గోపాల్ మాట్లాడుతూ నిజాం పాలన కాలంలో ఒకానొక సంస్థానం నేపథ్యంగా ఈ చిత్ర కథ సాగుతుంది. నాజర్, రేవతి సహజ నటన ఈ చిత్రానికి హైలెట్‌గా ఉంటుంది. విలియం షేక్స్పియర్ ప్రసిద్ధ రచన 'మేక్బెత్" ఆధారంగా తెలుగులో నిర్మించిన చిత్రం ఇది. చిత్రానికి దర్శకత్వం వహించిన మోహనకోడా కీర్తిశేషులయ్యారు. చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తయినా అనివార్య కారణాలవల్ల విడుదల కాలేదు. ఇప్పుడు విడుదల చేయడానికి ముందుకు వచ్చాం అని తెలిపారు.
నాజర్, రేవతి, సోనాలికులకర్ణి సహజనటన ఈ చిత్రానికి హైలెట్. ఈ చిత్రానికి మాటలు, పాటలు: భూపాల్‌రెడ్డి, మోహన్‌రుషి, సంగీతం: పండిట్ శాంతకుమార్, ఛాయాగ్రహణం: మధుమహంకాళి, కథ, స్క్రీన్‌ప్లే : మెహన్కోడా, రాహుల్‌కోడా, నిర్మాతలు: కె.రామ్‌గోపాల్, రమేష్ వేముగంటి, దర్శకత్వం: మోహన్కోడా.