రాజశేఖర్ ఆలాంటి పని చేశారంటే ఎవరూ నమ్మురు: నటి రోజా సపోర్ట్

By Bojja Kumar

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఇష్యూ తెరపైకి వచ్చిన తర్వాత టీవీ ఛానల్‌లో మొదలైన చర్చాకార్యక్రమాల్లో సినీనటులు జీవిత, రాజశేఖర్‌పై తీవ్రమైన ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తన భర్త రాజశేఖర్ కోసం జీవిత అమ్మాయిలను పంపేదని కొందరు ఆరోపణలు చేయడం తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ నేపథ్యంలో జీవిత కూడా మీడియా ముందుకు వచ్చి కౌంటర్ ఇచ్చారు. తనపై ఆరోపణలు చేసిన వ్యక్తితో పాటు, న్యూస్ ఛానల్ మీద ఆమె మండి పడ్డారు. తమను అన్యాయంగా టార్గెట్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదంపై తాజాగా సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు.

రాజశేఖర్ అలాంటోడు కాదంటున్న రోజా

రాజశేఖర్ అలాంటోడు కాదంటున్న రోజా

హీరో రాజశేఖర్‌తో కలిసి తాను రెండు సినిమాలు చేశానని, ఆయన అలాంటి వ్యక్తి కాదని రోజా తెలిపారు. ఆయన పూర్తిగా ఫ్యామిలీ పర్సన్. జీవిత లేకుండా రాజశేఖర్‌ బయటకు కూడా వెళ్లరు. ఇప్పుడు ఆయన తన పిల్లలు లేకుండా కూడా బయటకు వెళ్లట్లేదు అని రోజా తెలిపారు.

ఆయన ఈ పని చేశారంటే ఎవరూ నమ్మరు

ఆయన ఈ పని చేశారంటే ఎవరూ నమ్మరు

అలాంటి ఫ్యామిలీ మ్యాన్ ఇలాంటి పని చేశాడంటే ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు. కావాలనే వేరే ఉద్దేశంతోనే ఆయనను టార్గెట్‌ చేసి ఇటువంటి ఆరోపణలు చేశారని అనుకుంటున్నాను. ఇది ఆయనపై బురదజల్లే ప్రయత్నమే, మా ఆయన కూడా రాజశేఖర్‌కి క్లోజ్‌ ఫ్రెండ్‌... అని రోజా వ్యాఖ్యానించారు.

అలాంటివి ఉంటే వెంటనే బయటకు వచ్చేవి

అలాంటివి ఉంటే వెంటనే బయటకు వచ్చేవి

రాజశేఖర్ అలాంటి పనులు ఏమైనా చేసి ఉంటే వెంటనే బయటకు వచ్చేది, లేదా కొంతకాలం ఆగిన తర్వాత వచ్చేది. కానీ అలాంటిదేమీ జరుగేలేదు. ఆయనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని రోజా చెప్పే ప్రయత్నం చేశారు.

 బహిరంగ లేఖతో తిప్పి కొట్టిన జీవిత

బహిరంగ లేఖతో తిప్పి కొట్టిన జీవిత

తమపై ఆరోపణలు వచ్చిన వెంటనే.... జీవిత బహిరంగ లేఖ సంధించడంతో పాటు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆరోపణలు తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. మాపై వచ్చే ఆధారంలేని ఈ వార్తలను నమ్మొద్దు. సినీరంగంలో క్యాస్టింగ్ కౌచ్‌ అంశంపై ఏర్పాటు చేసే కమిటీలో సభ్యురాలిగా ఉండబోతున్నందుకు అడ్డుపడటానికి చేసే ప్రయత్నం ఇది. కొందరు ప్లాన్ ప్రకారం ఆడుతున్న నాటకం. కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలిగా ఓ గౌరవప్రదమైన పదవిలో కొనసాగుతున్న నాపై సీ గ్రేడ్ న్యూస్ ఛానెళ్లు అసత్య ప్రచారం చేస్తున్నాయి. పబ్లిసిటీ కోసం టీవీలో కనిపించి కొందరు అసత్యాలు పలుకుతున్నారు. ఒక మహిళగా నేను ఏనాడు సాటి ఆడదానికి అన్యాయం చేయలేదు. అని జీవిత, రాజశేఖర్ సంయుక్తంగా ఓ లేఖను విడుదల చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X