భర్తతో విడాకులు, నటి రోజా స్పందన ఇలా...

By Bojja Kumar

హైదరాబాద్: ప్రముఖ తెలుగు నటి రోజా తమిళ దర్శకుడు సెల్వమణిని 2002లో పెళ్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె భర్తతో విడిపోతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. గత కొంత కాలంగా రోజా, సెల్వమణి విడిగానే ఉంటున్నారు. సెల్వమణి చెన్నైలో ఉంటుండగా....రోజా ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో ఈ వార్తలపై రోజాస్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసారు. వృత్తి పరమైన కారణాలతో తాము ప్రస్తుతం కలిసి ఉండటం లేదని, అంత మాత్రాన తాము విడిపోయినట్లు కాదని ఆమె తెలిపారు. కావాలనే కొందరు తమ బంధంపై దుష్ర్పచారం చేస్తున్నారని ఆమె తెలిపారు.

Actress Roja denies her divorce rumors

'ప్రేమ తపస్సు' చిత్రంలో రాజేంద్ర ప్రసాద్‌ సరసన నాయికగా తెలుగు చిత్ర సీమలోకి అడుగిడిన రోజా అంతకుముందే చెంబర్తి అనే తమిళ చిత్రంలో ప్రశాంత్‌ సరసన నటించింది. గ్లామర్‌, చలాకీదనంతో తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో హీరోయిన్‌గా నిలదొక్కు కోగలిగింది. సీతారత్నంగారి అబ్బాయి, సర్పయాగం, శుభలగ్నం, పోలీస్‌బ్రదర్స్‌, ముగ్గురు మొనగాళ్ళు, ఘటోత్కచుడు, బిగ్‌బాస్‌, భైరవద్వీపం, ఫ్యామిలీ సర్కస్‌, గాండీవం, శ్రీకృష్ణార్జున యుద్ధం తదితర చిత్రాల్లో అందరి హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది.

తమిళంలో ప్రభు, సత్యరాజ్‌, శరత్‌కుమార్‌, విజయ్‌కాంత్‌, ప్రభుదేవా, కార్తీక్‌, పార్ధీబన్‌, మలయాళంలో మమ్ముట్టి ప్రభృతులతో నటించిన రోజూ సెల్వమణి వివాహం చేసుకుని రోజా సెల్వమణి అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X