సినీ పరిశ్రమలో షాక్.. జేబులు కొడుతూ దొరికేసిన ప్రముఖ నటి.. అడిగితే ఏమందంటే?

బెంగాలీ చిత్ర పరిశ్రమ నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇండస్ట్రీ నటి రూప దత్తా పిక్ పాకెటింగ్ అనే ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. అదేంటి ఒక నటి అయి ఉండి ఇలా పిక్ పాకెటింగ్ చేస్తుంది అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదవాల్సిందే.

లైంగిక వేధింపుల ఆరోపణలు

లైంగిక వేధింపుల ఆరోపణలు


రూప దత్తా బెంగాలీ నటి. రూప బెంగాలీతో సహా పలు హిందీ సీరియల్స్‌లో కూడా నటించింది. ఆమె 'జై మా వైష్ణో దేవి' అనే టీవీ సీరియల్‌లో మాతా వైష్ణో దేవి పాత్రను పోషించింది. అయితే 2020లో అనురాగ్ కశ్యప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నటి రూప దత్తా అనురాగ్ కశ్యప్ ఫేస్‌బుక్‌లో తప్పుడు సందేశాలు పంపారని, ఆ తర్వాత తాను అనురాగ్ అనే వ్యక్తితో మాట్లాడుతున్నట్లు తేలిందని నటి తెలిపింది. రూప తన ఫేస్‌బుక్ చాట్ స్క్రీన్‌షాట్‌ను కూడా ట్వీట్ చేసింది.

పర్సులు కొట్టేసి

పర్సులు కొట్టేసి

ఇక తాజాగా ఆమె దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. కోల్​కతాలో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ బుక్ ఫెయిర్‌లో దొంగతనం చేసినందుకు ఆమెను పోలీసులు అరెస్ట్​ చేశారు. బాధితుల దృష్టి మరల్చి ఆమె చాకచక్యంగా వారి పర్సులు కొట్టేసింది అని అధికారులు చెబుతున్నారు. కొట్టేసిన పర్సును చెత్త కుండీలో వేయడాన్ని ఓ పోలీసు అధికారి గమనించారు. వెంటనే వారించే ప్రయత్నం చేశారు. ఆమె వద్దకు వెళ్లి అసలు ఎందుకు అలా చేశారు? అని ప్రశ్నించారు.

మార్చి 12, 2022న

మార్చి 12, 2022న

ఆ సమయంలో ఆమె నుంచి పొంతన లేని సమాధానాలు వచ్చాయి. దీంతో వెంటనే అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అసలు బాగోతం వెలుగుచూసింది. ఆమె బ్యాగ్ చెక్ చేయగా 75 వేల రూపాయల డబ్బుతో పాటు చాలా పర్స్​లు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మార్చి 12, 2022 న, అంతర్జాతీయ కోల్‌కతా బుక్ ఫెయిర్‌లో జేబు దొంగతనం సంఘటన వెలుగులోకి వచ్చిందని, ఆ తర్వాత నటిని పోలీసులు అరెస్టు చేశారని చెబుతున్నారు.

సినిమాలు సహా టీవీ సీరియల్స్‌లో

సినిమాలు సహా టీవీ సీరియల్స్‌లో

విచారణలో నిమగ్నమైన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఆ తరువాత విచారణలో, జేబు దొంగతనం చేసినట్లు రూప దత్తా ఒప్పుకుంది. అలాగే తను చాలా జాతరలు, కార్యక్రమాలకు హాజరయ్యానని, అక్కడ రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లి ప్రజల పర్సులు దొంగిలించానని చెప్పింది. ఈ వార్త రూప దత్తా అభిమానులకు షాకింగ్ గా మారింది. ఇంత పాపులర్ నటి పాకెట్ మార్ ఎలా అయ్యిందో ఎవరికీ అర్థం కావడం లేదు. రూపా దత్తా అనేక సినిమాలు సహా టీవీ సీరియల్స్‌లో భాగమైంది. ప్రస్తుతం ఈ విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Recommended Video

Nayanthara Imaikka Nodigal Movie Whopping Rs.12 Crore | Filmibeat Telugu
మహిళా సాధికారత కోసం

మహిళా సాధికారత కోసం

ఇక రూపా దత్తా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఇచ్చిన సమాచారం ప్రకారం, ఆమె 'జై మా వైష్ణో దేవి' టీవీ సీరియల్‌లో మాతా వైష్ణో దేవి పాత్రను పోషించింది. ఆమె తనను తాను రచయితగా, దర్శకురాలిగా అలాగే ఒక సామాజిక కార్యకర్తగా అభివర్ణించుకుంది. అది మాత్రమే కాదు, ఆమె రూప దత్తా యాక్టింగ్ అకాడమీ యజమాని కూడా. ఆమె 2019లో ఈ అకాడమీని ప్రారంభించారు. రూపా దత్తా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా యొక్క బయోలో ఆ అకాడమీ లింక్‌ను కూడా షేర్ చేసింది. ఇక దాని ప్రకారం, ఆమె 10 సంవత్సరాల వయస్సు నుండి పని చేస్తుంది. ఆమె షూల్ అనే ఫౌండేషన్‌ను కూడా ప్రారంభించింది. దీని ద్వారా ఆమె మహిళా సాధికారత కోసం కూడా పనిచేస్తుంది.

More from Filmibeat

Read more about: anurag kashyap
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X