»   » అలనాటి అందాల నటి కన్నమూత

అలనాటి అందాల నటి కన్నమూత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అలనాటి బాలీవుడ్ అందాల నటి సాధన శివదాసానీ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యం కారణంగా ఆమె శుక్రవారం తుదిస్వాస విడిచారు. సెప్టెంబర్లో 74వ పుట్టినరోజు జరుపుకున్న సాధన అనారోగ్యంతో హిందూజా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆమె మరణవార్త వినగానే అభిమానులు, బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేసారు.

సాధన చాలా కాలంగాతో క్యాన్సర్ తో పోరాటం చేసారు. గతేడాది డిసెంబర్లో ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీలో ఆమె ఇటీవల చికిత్స కూడా చేయించుకున్నారు. సాధన తుది శ్వాస విడిచినట్లు ఫ్యామిలీ క్లోజ్ ఫ్రెండ్, బీజేపీ లీడర్ షైనా ఎన్.సి ధృవీకరించారు. శుక్రవారం తెల్లవారుజామున ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు తెలిపారు.

Actress Sadhana Shivdasani passes away

సాధనా వయస్సు 74 సంవత్సరాలు. 1960, 70 దశకాల్లో ఆమె తన నటనతో యువతను ఉర్రూతలూగించారు. ‘లవ్ ఇన్ షిమ్లా' మూవీతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ‘పారఖ్', ‘హమ్ దోనో', ‘శ్రీ 420', ‘మేరె మెహబూబ్', ‘వాక్', ‘వో కౌన్ థి' తదితర చిత్రాల్లో ఆమె నటించారు.

English summary
Veteran actress Sadhana Shivdasani passed away today morning. The actress who completed 74 years of age this September, was reportedly admitted to the Hinduja hospital.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu