ఎన్నికల వేళ సమంత సంచలన ట్వీట్... ఆ పార్టీ అభ్యర్థికి మద్దతు!
ఎన్నికల వేళ అక్కినేని కుటుంబం ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా, ఎవరికీ ప్రచారం చేయకుండా న్యూట్రల్‌గా ఉన్నారు. అయితే అక్కినేని కోడలు సమంత మాత్రం ఓ పార్టీకి చెందిన అభ్యర్థికి మద్దతు ఇస్తూ ట్వీట్ చేయడం, అతడికి ఓటు వేసి గెలిపించాలని కోరడం చర్చనీయాంశం అయింది.
సమంత సపోర్ట్ చేస్తున్న వ్యక్తి ఓ ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థి కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థికి ఆమె తన మద్దతు ప్రకటించారు. దీంతో కొందరు అభిమానులు ఆమెను ట్విట్టర్ ద్వారా... ఆయకు మీకు రిలేషన్ ఏమిటి? మీ ఫ్యామిలీ ఫ్రెండా? అంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు.

వైరల్ అవుతున్న సమంత వీడియో
నా కుటుంబ స్నేహితుడికి ఓటు వేయాలని కోరుతున్న సమంత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది సమంత ఒక పార్టీకి మద్దతు ఇస్తూ ప్రచారం చేయడం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆయనకు వ్యక్తిగతంగా సపోర్ట్ చేయడానికి కారణం ఏమిటి? అనేది హాట్ టాపిక్ అయింది.

సమంత రియాక్షన్
‘అవును ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్. నేను వ్యక్తిగతంగా ఆయనకు మద్దతు ఇస్తున్నాను. ఆయన సోదరి డాక్టర్ మంజుల నాకు బాగా తెలుసు. నేను హైదరాబాద్‌కు మూవ్ అయినప్పటి నుంచి నాకు పరిచయం. మంచి వ్యక్తి కాబట్టే మద్దతు ఇస్తున్నాను' అంటూ అంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమంత రిప్లై ఇచ్చారు.

ప్రత్యూష ఫౌండేషన్
‘ప్రత్యూష ఫౌండేషన్' అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా సమంత పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫౌండేషన్ డాక్టర్ మంజులతో కలిసి రన్ చేస్తోంది సమంత. ఆయన మంజుల సోదరుడు కావడంతో ఆయనకు మద్దతుగా సమంత ప్రచారం చేస్తోంది.

సమంత సినిమాలు..
సమంత సినిమాల విషయానికొస్తే... ఆమె తన భర్త నాగ చైతన్యతో కలిసి నటించిన ‘మజిలీ' చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం అందుకుంది. మరో వైపు ఆమె నటించిన తమిళ మూవీ ‘సూపర్ డీలక్స్' చిత్రం కూడా గత వారం విడుదలై విజయం అందుకుంది. ప్రస్తుతం సామ్ ‘ఓ బేబీ ' అనే చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











