»   »  అన్ని పెళ్లిళ్లైనా అతడి ప్రేమలో పడతారు, విజయ్ దేవరకొండ రెస్పెక్ట్ ఇవ్వలేదు: సమంత

అన్ని పెళ్లిళ్లైనా అతడి ప్రేమలో పడతారు, విజయ్ దేవరకొండ రెస్పెక్ట్ ఇవ్వలేదు: సమంత

Posted By:
Subscribe to Filmibeat Telugu
Samantha,Keerthy Suresh Special Interview On Mahanti

సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ 'మహానటి' మే 9న విడుదలవుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో టైటిల్ పాత్రలో కీర్తి సురేష్, జర్నలిస్టు పాత్రలో సమంత మెయిన్ రోల్స్ చేశారు. సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ ఇద్దరూ కలిసి సినిమాకు సంబంధించిన విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నారు. తమ తమ పాత్రల గురించి, నాగ్ అశ్విన్ దర్శకత్వం గురించి, నిర్మాతలు స్వప్న-ప్రియాంకకు సినిమాపై ఉన్న పాషన్ గురించి వివరించారు. ఈచిత్రంలో నటించిన విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు.

చాలా గర్వంగా ఫీలయ్యాను: సమంత

చాలా గర్వంగా ఫీలయ్యాను: సమంత

నాగ్ అశ్విన్ కథ చెప్పగానే వెంటనే ఒప్పుకున్నాను. ఒక గొప్ప నటికి చెందిన జీవిత కథతో తీస్తున్న బయోపిక్‌లో నేనూ భాగం కావాలనుకున్నాను. ఈ అవకాశం నాకు రావడం చాలా గర్వంగా ఫీలయ్యాను. ఈ చిత్రంలో ఎంతో మంది సీనియర్ ఆర్టిస్టులు నటిస్తున్నారు. చిన్న రోల్ అయినా చేయడానికి వారు వెనకాడలేదు. ఎందుకంటే ఈ సినిమా గొప్పదనం అలాంటిది... అని సమంత తెలిపారు.

నాగ్ అశ్విన్ కథ చెప్పగానే వెంటనే నో చెప్పాను: కీర్తి సురేష్

నాగ్ అశ్విన్ కథ చెప్పగానే వెంటనే నో చెప్పాను: కీర్తి సురేష్

నాగ్ అశ్విన్ ఈ కథ చెప్పగానే వెంటనే నో చెప్పాను. ఇలాంటి గొప్ప సినిమాలో నేను సరిపోను. సావిత్రి పాత్ర చేయాలంటే ఎంతో రెస్సాన్సిబిలిటీ భుజాలపై ఎత్తుకోవాలి. నేను అలా చెప్పడంతో నాగ్, ప్రియాంక, స్వప్న ముగ్గురు కలిసి బ్రెయిన్ వాష్ చేశారు. చివరకు నన్ను ఒప్పించారు అని కీర్తి సురేష్ తెలిపారు.

సినిమాపై చాలా డౌట్స్ ఉండేవి: కీర్తి సురేష్

సినిమాపై చాలా డౌట్స్ ఉండేవి: కీర్తి సురేష్

అయితే సినిమాపై చాలా డౌట్స్ ఉండేవి. సావిత్రి జీవితంలో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. నేను చేస్తే ప్రేక్షకులకు రీచ్ అవుతుందా? ఒక వేళ రాంగ్ వేలో కథ డ్రైవ్ అయితే పరిస్థితి ఏమిటి? అనే డౌట్ ఉండేది. అపుడు నాగి ఒకటే చెప్పారు. సినిమాలో వాస్తవం చూపిస్తున్నాం. ఆమె జీవితంలో ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్లు చెబుతున్నాం, దీని వల్ల నీకు ఎలాంటి బ్యాడ్ నేమ్ రాదు అని కన్విన్స్ చేశారు, కాన్ఫిడెంటుగా ఈ సినిమా చేసేలా చేశారు అని కీర్తి సురేష్ తెలిపారు.

 అన్ని పెళ్లిళ్లు చేసుకున్నా అతడిని లవ్ చేశారు: సమంత

అన్ని పెళ్లిళ్లు చేసుకున్నా అతడిని లవ్ చేశారు: సమంత

ఈ సినిమాకు జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించడం చాలా ప్లస్ పాయింట్. ఈ క్యారెక్టర్లో షేడ్స్ ఆఫ్ గ్రే ఉంటుంది. ఇలాంటి గ్రే క్యారెక్టర్ మన అందరిలోనూ ఉంటుంది. మనం ఎప్పుడూ తెరపై పర్ఫెక్ట్ పీపుల్‌, పర్ఫెక్ట్ సిచ్యువేషన్స్, పర్ఫెక్ట్ సర్కమ్‌స్టెన్సెస్ చూడాలనుకుంటాం. కానీ నిజమైన లైఫ్‌లో అలా ఉండదు. మన జీవితంలో కూడా ఏదో ఒక సమయంలో తప్పులు చేస్తాం. అలా చేసి ఉండాల్సింది కాదు ఏదో ఒక సమయంలో ఫీలవుతాం. కొన్నిసార్లు పరిస్థితులు బ్యాడ్ అవ్వొచ్చు, కానీ పర్సన్ బ్యాడ్ కాక పోవచ్చు. ఈ పాత్రలో దుల్కర్ బ్రిలియంట్‌గా చేశారు. అన్ని పెళ్లిళ్లు చేసుకున్నా అమ్మాయిలు ఆయన(జెమినీ గణేశన్) ప్రేమలో పడిపోతారు. ఈ పాత్రకు దుల్కర్ రైట్ పర్సన్.... అని సమంత తెలిపారు.

విజయ్ దేవరకొండ రాక్ స్టార్, నేను సీనియర్ అయినా రెస్పెక్ట్ ఇవ్వేలేదు: సమంత

విజయ్ దేవరకొండ రాక్ స్టార్, నేను సీనియర్ అయినా రెస్పెక్ట్ ఇవ్వేలేదు: సమంత

విజయ్ దేవరకొండ రాక్ స్టార్. అతడు సెట్లో ఉంటే చాలా ఫన్ ఉంటుంది. నేచురల్ యాక్టర్, అతడి పెర్ఫార్మెన్స్‌లో ఈజ్ ఉంటుంది. ఆయనకంటే నేను సీనియర్.. నాకు రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేదాన్ని... కానీ అతడి నుండి ఏమీ రాలేదు అంటూ సమంత(నవ్వుతూ) వ్యాఖ్యానించారు.

జర్నలిస్ట్ మధురవాణి పాత్ర గురించి...

జర్నలిస్ట్ మధురవాణి పాత్ర గురించి...

సినిమాలో మధురవాణి పాత్ర ఉండటానికి ముఖ్యమైన రీజన్ ఉంది. ఈ జనరేషన్ వారికి సావిత్రి గురించి ఏమీ తెలియదు. పాతకాలం నటి గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా చాలా మందికి ఉండదు. మధురవాణి క్యారెక్టర్ ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. జర్నలిస్టుగా ఎలా ఆమె సావిత్రి మీద ఇంట్రస్టు పెంచుకుంది, సావిత్రిని ఆడియన్స్ కు ఎలా రిప్రజంట్ చేసింది అనేది ఆసక్తిగా ఉంటుంది. ప్రేక్షకుల్లో కూడా సావిత్రపై ఆసక్తి పెరిగేలా ఈ పాత్ర చేస్తుంది... అని సమంత తెలిపారు.

తెలుగు సినిమా గోల్డెన్ ఫేజ్: సమంత

తెలుగు సినిమా గోల్డెన్ ఫేజ్: సమంత

ప్రస్తుతం తెలుగు సినిమా ఒక గోల్డెన్ ఫేజ్‌లో ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రతి సినిమా రికార్డ్ బ్రేకింగ్ చేస్తూ దూసుకెళుతోంది. పరిశ్రమ కొత్త కొత్త బెంచ్ మార్క్స్ సెట్ చేసుకుంటోంది. సావిత్రి కూడా అలాంటి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది అని సమంత తెలిపారు.

 ఈ సినిమా ద్వారా ఉమెన్ షైన్ అవుతారు: సమంత

ఈ సినిమా ద్వారా ఉమెన్ షైన్ అవుతారు: సమంత

మనం ఎప్పుడూ అనుకుంటాం... అమ్మాయిలకు ఇది దొరకలేదు, అది దొరకలేదు, అమ్మాయిలకు ఫేర్ షేర్ దొరకలేదు, సరైన పాత్రలు ఇవ్వడం లేదు అని. ఇలాంటి ఒక ప్రొడక్షన్ సెటప్ ఉన్నపుడు. దాన్ని మహిళలు రన్ చేస్తున్నపుడు అంతా ఫెయిర్‌గా ఉంటుంది. మన చుట్టూ అమ్మాయిలే కనిపిస్తారు. ఉమెన్ షైన్ అవుతారు. స్వప్న, ప్రియాంక వెరీ వెరీ స్ట్రాంగ్ ఉమెన్.... అని సమంత తెలిపారు.

English summary
Keerthi Suresh, who plays Savitri and Samantha, who plays Madhuravani in Mahanati / Nadigaiyar Thilagam speak about the film in this special interview with anchor Jhansi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X