»   »  అలాంటి నీచులున్నారు: కాస్టింగ్ కౌచ్‌పై తొలిసారి స్పందించిన సమంత!

అలాంటి నీచులున్నారు: కాస్టింగ్ కౌచ్‌పై తొలిసారి స్పందించిన సమంత!

Posted By:
Subscribe to Filmibeat Telugu
    Samantha First Time Responds On Industry Culture

    తెలుగు సినిమా పరిశ్రమలో గత కొన్ని వారాలుగా కాస్టింగ్ కౌచ్ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నటి శ్రీరెడ్డి ఇండస్ట్రీలోని ఈ నీచమైన సంస్కృతి, మహిళలపై జరుగుతున్న లైంగిక దోపిడీని నిరసిస్తూ అర్దనగ్న ప్రదర్శన చేయడంతో ఈ వ్యవహారం మరింత హీటెక్కింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మీడియాలో హాట్ టాపిక్ కావడం, ఇండస్ట్రీ పెద్దలు అంతా కదిలివచ్చి క్యాష్ కమిటీ వేసి పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా ఓ ఆంగ్లప్రతిక ఇంటర్వ్యూలో పాల్గొన్న స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత ఈ అంశంపై రియాక్ట్ అయ్యారు.

     కేవలం సినిమా పరిశ్రమలోనే కాదు..

    కేవలం సినిమా పరిశ్రమలోనే కాదు..

    కాస్టింగ్ కౌచ్ కాంట్రవర్సీ మీద సమంత స్పందిస్తూ... ‘కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు, ప్రతి ఇండస్ట్రీలోనూ ఇలాంటి నీచమైన సంస్కృతి ఉందని, ఈ రంగం...ఆ రంగం అని నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, అన్ని చోట్ల ఇది ఉంది అని సమంత తెలిపారు.

    సినిమా ఇండస్ట్రీలోనూ...

    సినిమా ఇండస్ట్రీలోనూ...

    మంచి, చెడు అనేది అన్ని రంగాల్లో ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో అలాంటి బ్లాక్ షీప్స్(నీచులు) ఉన్నారు. గత 8 సంవత్సరాలుగా నేను తెలుగు, తమిళం ఇండస్ట్రీలో పని చేస్తున్నాను. నా తొలి సినిమా హిట్ కావడంతో కెరీర్ పరంగా ఎప్పుడూ స్ట్రగుల్ కాలేదు, అలాంటి పరిస్థితులు నాకు ఎదురు కాలేదు అని సమంత తెలిపారు.

    సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది మంచి వారు కూడా

    సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది మంచి వారు కూడా

    ‘అయితే నేను మనస్ఫూర్తిగా ఒక విషయం చెప్పగలను. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. ఎంతో అందమైన మనసు ఉన్న, సహాయగుణం ఉన్న మనుషులను ఈ ఇండస్ట్రీలో కలిశాను. అందుకే భవిష్యత్తులో పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇండస్ట్రీలో కంటిన్యూ కావాలని నిర్ణయించుకున్నాను అని సమంత తెలిపారు.

    లైంగిక దోపిడీపై స్పెషల్ సెల్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి

    లైంగిక దోపిడీపై స్పెషల్ సెల్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి

    మహిళలపై జరుగుతున్న సెక్సువల్ ఎక్స్‌ప్లోటేషన్ (లైంగిక దోపిడి) విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి, స్పెషల్ సెల్ ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరించి తగిన చర్యలు తీసుకోవాలి అని సమంత అభిప్రాయ పడ్డారు.

     సమంత సినిమాలు

    సమంత సినిమాలు

    సమంత సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆమె తెలుగులో నటించిన ‘మహానటి', తమిళంలో నటించిన ‘ఇరుంబు తిరై' చిత్రాలు మే 9, మే 11 తేదీల్లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. మహానటి చిత్రంలో సమంత కీలకమైన పాత్రలో నటించింది. ఇందులో ఆమె జర్నలిస్టు మదురవాణి పాత్రలో నటించనునంది.

    English summary
    In an interview with Deccan Chronicle, the actress Samantha spoke about the casting couch controversy at length. She said, “Not only in films, casting couch is there in every industry. I can’t comment about each and everyone’s virtue or qualities. There will be a few black sheep. But I am working in Tamil and Telugu industry for the last eight years. My first film was a hit and I didn’t have much of a struggle.”
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more