హీరోయిన్ సమంతకు దేవుడిచ్చిన కొడుకు (ఫోటో)
హైదరాబాద్: ఇటీవల సమంత తన ట్విట్టర్లో స్పందిస్తూ....నాకు అర్జంటుగా బేబీ కావాలి, అది కూడా మూడు రోజుల్లోగా అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె ట్వీట్ చూసి అంతా ఆశ్చర్య పోయారు. ఆమె అలా ట్వీట్ చేయడానికి కారణం మహేష్ బాబు కూతురు సితార. 'శనివారం సితారతో ఆడుకోవడానికి డేట్ ఇచ్చేశా. కానీ సితార తనతో ఆడుకోవడానికి నాతో పాటు బేబీని కూడా తీసుకురమ్మంది. శనివారంలోగా బేబీని ఎలా అరేంజ్ చేయ్యాలి' అంటూ సితారతో దిగిన ఫొటోను జత చేసి సరదాగా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు సమంత.

తాజాగా సమంత 'నా దేవడు ఇచ్చిన కొడుకు' అంటూ ఓ పిల్లాడి ఫోటో ట్వీట్ చేసింది. ఆ పిల్లాడు ఎవరో కాదు సమంత పర్సనల్ స్టైలిస్ట్ నీరజ కోన కుమారుడు ఆన్ష్. ఆ పిల్లాడంటే సమంతకు చాలా ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా ఆ పిల్లాడితో సమంత ఆడుకుంటుందట.


Click it and Unblock the Notifications











