»   »  నేడు సమంత బర్త్ డే: చిన్నపుడు ఎంత క్యూట్‌గా ఉందో... (ఫోటోస్)

నేడు సమంత బర్త్ డే: చిన్నపుడు ఎంత క్యూట్‌గా ఉందో... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ స్టార్ హీరోయిన్ సమంతకు, ఆమె అభిమానులకు, ముఖ్యంగా ఆమెకు కాబోయే భర్త నాగ చైతన్యకు ఈ రోజు చాలా స్పెషల్. ఎందుకంటే ఈ రోజు సమంత పుట్టినరోజు. నేడు సమంత 30వ పుట్టినరోజు. ముందుకు ఆమెకు ఫిల్మ్‌బీట్ తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

మోడింగ్ తో కెరీర్ మొదలు పెట్టిన సమంత పదేళ్ల క్రితం అంటే 2007లో సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుంది. రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు సైన్ చేసింది. అయితే ఆ సినిమా తెరకెక్కలేదు. తర్వాత 2010లో నాగ చైతన్యకు జోడీగా 'ఏ మాయ చేశావే' సినిమాతో నటిగా తెరంగ్రేటం చేసింది.

తొలి సినిమా విజయం సాధించడం, ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ వరుస హిట్స్ కావడంతో సమంతకు లక్కీ హీరోయిన్ అనే పేరొచ్చింది. అలా వరుస అవకాశాలతో తెలుగులో టాప్ హీరోయిన్ గా తన హవా కొనసాగించింది సమంత.

సమంత చిన్నతనంలో

సమంత చిన్నతనంలో

సమంత 1987, ఏప్రిల్ 28న జన్మించింది. తల్లి మళయాలి, తండ్రి తెలుగు. చిన్నప్పటి నుంచి చెన్నయ్ లోనే పెరిగింది. అందు వల్ల ఆమె తమిళం చాలా బాగా మాట్లాడగలదు. తన కుటుంబ నేపథ్యం తమిళనాడు కాక పోయినా...అక్కడే పుట్టి పెరగడం వల్ల తనను తాను తమిళియన్ గానే చెప్పుకుంటుంది సమంత.

సామ్

సామ్

సమంత తన పాఠశాల విద్యను టి నగర్లోని హోలీ ఏంజిల్స్ ఆంగ్లో-ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పూర్తి చేసింది. చెన్నయ్ లోని స్టెల్లా మేరీ కాలేజ్ నుంచి కామర్స్ లో డిగ్రీ పొందింది.

కుటుంబ సభ్యులు

కుటుంబ సభ్యులు

సమంత ఫ్యామిలీ వివరాల్లోకి వెళితే తనకంటే పెద్దవారైన ఇద్దరు సోదరులు ఉన్నారు. ఒకరి పేరు డేవిడ్, మరికొరి పేరు జోనతన్ ప్రభు. జోనతన్ మీడియా ఇండస్ట్రీలో పని చేస్తుండగా, డేవిడ్ బిపిఓ సెక్టార్లో పని చేస్తున్నారు.

డబ్బుతో పాటు సేవ

డబ్బుతో పాటు సేవ

సమంత వరుస అవకాశాలతో బాగానే డబ్బు సంపాదించింది. అయితే ఆ డబ్బులో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తోంది. ప్రత్యూష సపోర్ట్‌ ఫౌండేషన్‌ అనే ఓ స్వచ్ఛంద సంస్థకు అండగా ఉంది. ఈ సంస్థకు తన వంతుగా సాయం చేయడంతో పాటు, నిధుల సమీకరణ చేస్తోంది.

నాగ చైతన్యతో వివాహం

నాగ చైతన్యతో వివాహం

సమంత త్వరలో అక్కినేని కుటుంబానికి కోడలుగా అడుగు పెట్టబోతున్నారు. జనవరిలో చైతన్యతో ఆమె నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ‘ఏమాయ చేసావె' చిత్రం సమయంలో చైతన్య, సమంత మధ్య ఏర్పడిన స్నేహం...ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. త్వరలో వీరి వివాహం జరుగబోతోంది.

ప్రస్తుతం సమంత చేస్తున్న సినిమాలు

ప్రస్తుతం సమంత చేస్తున్న సినిమాలు

సమంత ప్రస్తుతం తెలుగులో నాగార్జునతో కలిసి రాజుగారి గది-2, రామ్ చరణ్-సుకుమార్ మూవీ, సావిత్రి బయోపిక్ చేస్తోంది. తమిళంలో మరో మూడు సినిమాలు చేస్తోంది. ఈ సినిమా కమిట్మెంట్లు పూర్తయిన తర్వాత నాగ చైతన్య, సమంత వివాహం జరుగబోతోంది.

మందు, విందు... నాగ చైతన్య, సమంత పార్టీ ఫోటోస్ వైరల్!

మందు, విందు... నాగ చైతన్య, సమంత పార్టీ ఫోటోస్ వైరల్!

నాగ చైతన్య, సమంత త్వరలో భార్య భర్తలు కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరూ కలిసే ఉంటున్నారు. తాజాగా వీరికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోస్ కోసం క్లిక్ చేయండి.

English summary
Samantha Ruth Prabhu, one of the most sought after actress down south, has turned 30 on 28 April.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu