ఆఫర్ ఒప్పుకోకపోతే బెదిరించారు.. అందుకే ఇండస్ట్రీకి దూరం.. నోరు విప్పిన శ్రేష్ట, సంజన

By Rajababu

Recommended Video

Tollywood Heroines Reacts On Us incident

అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్ వ్యవహారంలో భయంకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. హీరోయిన్లను వ్యభిచారంలోకి దించారనే ఆరోపణలపై తెలుగు నిర్మాత, ఎన్నారై వ్యాపారవేత్త మొదుగుమిడి కిషన్ అలియాస్ శ్రీరాజ్ చెన్నుపాటి, అతని భార్య చంద్రకళ అరెస్ట్‌తో టాలీవుడ్ మరోసారి ఉలిక్కిపడింది. ఓ పక్క క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై శ్రీరెడ్డి రేపిన దుమారం సద్దుమణుగుతుండగా యూఎస్ సెక్స్ రాకెట్ బయటపడటం టాలీవుడ్ ప్రతిష్ట మసకబారే పరిస్థితి తలెత్తింది. అమెరికాలోని సెక్స్ రాకెట్ వ్యవహారంపై నటి శ్రీరెడ్డి, యాంకర్ అనసూయ, మా అధ్యక్షుడు శివాజీ రాజా తదితరులు స్పందించారు. ఈ నేపథ్యంలో మరో ఇద్దరు మహిళా సినీ ప్రముఖులు నోరు విప్పారు.

సంజన చెప్పినది ఇదే

సంజన చెప్పినది ఇదే

అమెరికాలో సాంస్కృతిక ఈవెంట్ల పేరుతో కొందరు సినీ తారలను సంప్రదించడం చాలా సాధారణంగా జరుగుతున్నది. అమెరికాకు సినీ తారలు వెళ్లడం కొత్తేమీ కాదు. టాలీవుడ్‌లో చిన్నాచితకా సీ లేదా డీ గ్రేడ్ ఆర్టిస్టులను కొందరు ఈవెంట్ల నిర్వాహకులు తీసుకెళ్లడం జరుగుతుంటుంది. అలాంటి వారినే ఇలాంటి వ్యవహారంలోకి లాగుతుంటారు అని సినీ నటి సంజన వెల్లడించింది.

పెద్ద మొత్తంలో డబ్బు ఆశజూపి

పెద్ద మొత్తంలో డబ్బు ఆశజూపి

ఈవెంట్లలో డ్యాన్సులు, స్కిట్స్ వేయడం కోసం ఆహ్వానిస్తుంటారు. అక్కడికి వెళ్లిన తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు ఆశచూపి బలవంతంగా వ్యభిచారం చేయిస్తుంటారు. కొందరు మాత్రం డబ్బు కోసం తమ అంగీకారంతో ఇలాంటి పనులకు ఒప్పకొంటారు అని సంజన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

రచయిత శ్రేష్టకు చేదు అనుభవం

రచయిత శ్రేష్టకు చేదు అనుభవం

అర్జున్‌రెడ్డి, పెళ్లిచూపులు చిత్రాలకు పాటలు రాసిన శ్రేష్టకు కూడా ఓ చేదు అనుభవం ఎదురైనట్టు మీడియాకు వెల్లడించారు. కేవలం సినీతారలే కాకుండా మహిళా గేయరచయితలను కూడా ఇలాంటి వ్యవహారాలకు టార్గెట్ చేస్తుంటున్నారు. ఇండస్ట్రీలో లైంగిక వివక్ష ఉంది. నిర్మాత కిషన్ భార్య నన్ను సంప్రదించింది. డబ్బు ఆశజూపి ఈ ముగ్గులోకి దించాలని చూపారు అని సినీ రచయిత శ్రేష్ట వెల్లడించారు.

నాకు బెదిరింపు కాల్స్

నాకు బెదిరింపు కాల్స్

ఓ సారి మహిళా దర్శకురాలు నాకు ఫోన్ చేసి ఓ నిర్మాత గోవాలో గ్రాండ్‌గా పార్టీని ఏర్పాటు చేశారు. నన్ను కూడా అందులో పాల్గొనమని ఆహ్వానించారు. వారి అభ్యర్థనను నేను తిరస్కరించాను. ఆ తర్వాత నాకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆ సమయంలో నాకు ఎవరూ సహకారం అందించలేదు. నన్ను దారుణంగా భయపెట్టారు. ఆ బెదిరింపులతో కొన్ని నెలలు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాను అని శ్రేష్ట ఓ జాతీయ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

నాకు అలాంటి గుర్తింపు వద్దు

నాకు అలాంటి గుర్తింపు వద్దు

అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు చిత్రాలతో మంచి గుర్తింపు వచ్చిన నేపథ్యంలో ఇలాంటి కారణాల వల్ల సినీ పరిశ్రమకు దూరమయ్యాను. చాలా మంది మిత్రులు బయటకు వచ్చి చెప్పమని అడిగారు. ఇండస్ట్రీలో నా పేరు మరో విధంగా వినిపించడం ఇష్టం లేక మానుకొన్నాను. నేను రాసిన సాహిత్యంతోనే గుర్తింపు పొందాలన్నది నా ఉద్దేశం అని శ్రేష్ట పేర్కొన్నారు.

మగవాళ్లతోనే కాకుండా

మగవాళ్లతోనే కాకుండా

సినీ పరిశ్రమలో మహిళలకు కేవలం మగవాళ్లతో ముప్పులేదు. ఇలాంటి దందాలో మహిళా ప్రముఖులు ఉన్నారు. ఇలాంటి దందాలోకి అమాయకులను లాగడం తరుచుగా ఇండస్ట్రీలో జరుగుతున్నది. ఇలాంటి కుంభకోణాలు బయటపడినప్పుడు చాలా విషయాలు నివ్వెరపాటుకు గురిచేస్తున్నాయి అని శ్రేష్ట పేర్కొన్నారు.

కిషన్, చంద్రకళ అరెస్ట్‌తో

కిషన్, చంద్రకళ అరెస్ట్‌తో

యూఎస్ సెక్స్ రాకెట్ వ్యవహారంలో ఫెడరల్ పోలీసుల జరిపిన విచారణలో కిషన్, చంద్రకళ దంపతులు అనేక అక్రమాలకు పాల్పడినట్టు వెల్లడైంది. హీరోయిన్లను, మోడల్స్, యాంకర్లను బీ1, బీ2, విజిటింగ్ వీసాలపై అమెరికాకు తీసుకెళ్లేవారు. ఈ దందా కోసం 2016 నవంబర్ 8 నుంచి 2017 నవంబర్ 29 మధ్యకాలంలో నిందితులు 76 విమాన టికెట్లను కొనుగోలు చేశారనే విషయం చర్చనీయాంశమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X