షూటింగులో గాయపడ్డ సంజన (ఫోటో)
బెంగులూరు: హీరోయిన్ సంజన గాయపడింది. కన్నడ టీవీ కార్యక్రమం షూటింగులో ఈ ఘటన చోటు చేసుకుంది. కన్నడలో పాపులర్ టీవీ కార్యక్రమమైన 'అశ్విని నక్షత్ర'లో ఆమె గెస్ట్ రోల్ చేస్తోంది. బుధవారం షూటింగు జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కుడికాలుకు జరిగిన ఈ గాయం కారణంగా తీవ్రమైన నొప్పితో బాధపడుతోంది.
షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. నొప్పి భరించలేనంతగా ఉండటంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు గాయానికి పది కుట్ల వరకు వేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వివరాలను సంజన తన సోషల్ నెట్వర్కింగులో వెల్లడించడంతో పాటు ఫోటో కూడా పోస్టు చేసింది.
'10 కుట్లు వేసారు. గాయం కారణంగా తీవ్రమైన బాధ కలిగింది. కుట్లు వేసే సమయంలో నొప్పి తెలియకుండా అనెస్తీషియా ఇచ్చారు. ఈ టీవీ కార్యక్రమం 'అశ్విని నక్షత్ర' షూటింగులో ఈ ఘటన చోటు చేసుకుంది.' అంటూ సంజన తన ట్విట్టర్ పేజీలో పేర్కొంది. నొప్పి ఉన్నపటికీ సంజన షూటింగ్ పూర్తి చేయడం గమనార్హం.
ఏ మాత్రం రెస్టు తీసుకోకుండా తన నటిస్తున్న తెలుగు సినిమాల షూటింగు కోసం బెంగుళూరు నుంచి హైదరాబాద్ బయల్దేరింది. ప్రస్తుతం ఆమె 'సరదా' అనే తెలుగు సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు వన్స్ ఎపానె టైం అనే మరో తెలుగు సినిమాకు కూడా ఆమె కమిటైంది.


Click it and Unblock the Notifications












