»   » అసలు ఏమైంది? కోర్టులో స్పృహ తప్పిన మాజీ హీరోయిన్

అసలు ఏమైంది? కోర్టులో స్పృహ తప్పిన మాజీ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సీనియర్ నటి సరిత కోర్టులో స్పృహ తప్పి పడిపోవడం చర్చనీయాంశం అయింది. మలయాళ నటుడు ముఖేష్‌ను ప్రేమించి పెళ్లాడిన సరితకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరి మధ్య విడాకుల కేసు నడుతస్తోంది. 2009లో ముఖేష్ సరిత నుంచి వివాహ రద్దు కోరుతూ చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ కాలం సాగిన ఈ కేసు విచారణ రెండేళ్ల క్రితం ముఖేష్, సరితకు విడాకులు మంజూరు చేస్తూ తీర్పు నిచ్చింది.

అనంతరం మిధుల అనే ఆమెను రెండో వివాహం చేసుకున్నారు ముఖేష్. అయితే వీరి వివాహం చెల్లదంటూ నటి సరిత కేరళ, కొచ్చిలోని కుటుంబ సంక్షేమ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అందులో ఆమె పేర్కొంటూ చెన్నై కోర్టులో ముఖేష్ వివాహ రద్దు కోరుతూ వేసిన పిటీషన్‌పై విచారణ జరిగే సమయంలో తాను దుబాయిలో ఉన్నానన్నారు. దీంతో కోర్టు జారీ చేసిన నోటీసులను తాను అందుకోలేకపోయానని వివరించారు. తాను కోర్టుకు హాజరు కాకపోవడంతో కోర్టు విడాకులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

Actress Saritha faints in court room

అందువలన ముఖేష్ రెండో వివాహం చెల్లదని తీర్పు ఇవ్వవలసిందిగా కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా సరిత, ముఖేష్‌లిద్దరూ గురువారం కొచ్చి కుటుంబ సంక్షేమ కోర్టుకు హాజరయ్యారు. విచారణానంతరం కోర్టు బోనులోంచి వెనుదిరిగిన సరిత అనూహ్యంగా స్పృహ తప్పి కింద పడిపోయారు.

మరోచరిత్ర, కోకిలమ్మ, అచ్చమిల్త్లె అచ్చమిల్త్లె తదితర చలన చిత్రాల్లో నటించి ఆమె గుర్తింపు పొందారు. ఆమె మొదటి కుమారుడు షర్వన్‌ దుబాయ్‌లో వైద్య కోర్సు చేస్తున్నాడని, రెండో కుమారుడు తేజస్సు డిగ్రీ చదువుతున్నాడు. వారికి తోడుగా ఆమె కూడా దుబాయ్ లోనే ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో తన భర్త ముఖేష్‌ మరో మహిళను వివాహం చేసుకున్నట్లు ఆమె ఆరోపించారు. 1988 ముఖేష్‌ మాధవన్‌తో కేరళలో సరిత వివాహం జరిగింది.

English summary
Yester-year heroine Saritha fainted in the court hall on Thursday. This happened during a hearing on her complaint against her former husband Mukesh.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu