మగాళ్లంటే భయపడుతున్న సెక్సీభామ
బాలీవుడ్ సెక్సీభామ ప్రీతి జింతాకు...ఎంత మంది క్రికెటర్లతో, వ్యాపార వేత్తలతో ఎఫైర్లు అంటగడుతూ వార్తలొచ్చాయో కొత్తగా చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో ఈ అమ్మడు ఇప్పడు మగాళ్లతో మాట్లాడటానికే భయ పడుతోంది. ఎవరితో మాట్లాడితో ఎక్కడ లింకు తగిలిస్తారో అని జంకుతుంది.
ఈ నేపథ్యంలో ప్రీతి మీడియాతో మాట్లాడుతూ...'ప్రస్తుతం నేను నా ప్రొఫెనల్ లైఫ్‌ను మసతౌల్యం చేసుకుని, జీవితంలో స్థిర పడటానికి ప్రయత్నిస్తున్నాను, దయచేసి నాకు వేరొకరితో ఎఫైర్ అంటగట్టి అసత్య ప్రచారం చేయడం ఆపండి, మీ ప్రచారం మూలంగా ఎవరైనా మగాళ్లతో మాట్లాడాలంటేనే భయంగా ఉంటోంది" అంటూ వాపోయింది.
ఇటీవల తనకు క్రికెటర్ బ్రెట్ లీతో ఎఫైర్ అంటగడుతూ వచ్చిన వార్తలపై ప్రీతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఐపీఎల్ మూలంగా తమ మధ్య మూడు సంవత్సరాల పరిచయం ఉంది. ఒకసారి అతనితో కలిసి డిన్నర్ చేసినందుకు లింకు అంటగట్టారు, ఇది ఎంత వరకు వరకు సమంజసం, ఇలాంటి వాటి వల్ల నేను వ్యక్తిగతంగా నష్టపోతున్నాను తన గోడు వెల్లబోసుకుంది.


Click it and Unblock the Notifications











