పాపం పండింది: నటికి మూడేళ్ల జైలు

హుమా ఖాన్ తన పని మనిషి కూతురు శాంతిని(16) తీవ్రంగా హించిందనే ఆరోపణలు ఎదుర్కొంది. హుమా ఖాన్ శాంతిని జూన్ 2007 నుంచి ఫిబ్రవరి 2008 వరకు తన వెంట పూణె తీసుకెళ్లింది. శాంతిని తన సొంత కూతురులా చూసుకుంటానని చెప్పిన హుమా ఖాన్ ఆమెను తీవ్రంగా హింసింది.
హుమా ఖాన్ మరియు ఆమె సోదరుడు షేక్ శాంతిని సిగరెట్ తో కాల్చి గాయ పరిచారని, శాంతి శరీరంపై 66 చోట్ల గాయపరిచారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆమె సోదరుడు శాంతిని మూడు సార్లు రేప్ చేసారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో వీరిపై రేప్, హత్యాయత్నం, కిడ్నాపింగ్, బెదిరింపులుకు సంబంధించి 307, 363, 376 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. నేరం రుజువు కావడంతో హుమా ఖాన్ కు మూడేళ్ల జైలు శిక్ష పడింది. అయితే ఆమె ప్రస్తుతం బెయిల్ పై విడుదలైంది. ఆమె సోదరుడు మాత్రం శక్తి హీనుడు అని రుజు కావడంతో అతను నిర్దోషిగా విడుదలయ్యాడు.


Click it and Unblock the Notifications