For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరోయిన్‌పై లైంగిక వేధింపుల కేసు: హీరోను 12 గంటలు విచారించిన పోలీసులు!

  By Bojja Kumar
  |

  తిరువనంతపురం: మలయాళ చిత్ర నటుడు దిలీప్‌ను కేరళ పోలీసులు దాదాపు 12 గంటలకుపైగా విచారించారు. ప్రముఖ మలయాళ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారులు ఆయన్ను బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు అలువా పోలీస్ క్లబ్‌కు పిలిపించి అర్దరాత్రి దాటిన తర్వాత 1.06 గంటలకు విడిచిపెట్టారు. దిలీప్‌తో పాటు డైరెక్టర్ నాదిర్షా, మేనేజర్ ఆపుని కూడా విచారించారు.

  పోలీస్ క్లబ్ నుండి బయటకు వస్తూ దిలీప్ మీడియాతో మాట్లాడుతూ..... తన కంప్లైంట్‌కు సంబంధించి పోలీసులకు అన్ని విషయాలు వెల్లడించానని తెలిపారు. నేను చాలా కాన్ఫిడెంటుగా ఉన్నాను, ఈ కేసును పోలీసులు ఎంతో బాగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పోలీసులకు తాను పూర్తి సహకారం అందిస్తున్నాను దిలీప్ తెలిపారు. మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కొందరు నన్ను దోషిగా చూస్తున్నారు. దయచేసి తప్పుకు కథనాలు వేసి జరిగిన ఘటనలను మార్చవద్దు. నన్ను బ్లాక్ మెయిల్ చేసిన వారిపైనా పోలీసులకు ఫిర్యాదు చేశాను అని దిలిప్ వెల్లడించారు.

  దిలీప్ మీద ముందు నుండి అనుమానాలే..

  దిలీప్ మీద ముందు నుండి అనుమానాలే..

  లైంగిక వేధింపులకు, కిడ్నాప్‌కు గురైన నటిపై దిలీప్ కు పాతగొడవలు ఉన్న నేపథ్యంలో.... ఆ సంఘటన జరిగిన వెంటనే అందరూ అతన్నే అనుమానించారు. అతడే ఇదంతా చేయించారనే సందేహాలు అప్పట్లో వ్యక్తం అయ్యాయి.

  పల్సర్ సునీల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఫిర్యాదు

  పల్సర్ సునీల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఫిర్యాదు

  నటిపై లైంగిక వేధింపులు, కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సునీల్‌తో పాటు మరో ఆరుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే సునీల్ తనను జైలు నుండి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, రూ. 1.5 కోట్ల డబ్బు ఇవ్వకుంటే తన పేరు చెబుతానని బెదిరిస్తున్నాడని దిలీప్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  అంతా అయోమయం

  అంతా అయోమయం

  పల్సర్ సునీల్ అండ్ గ్యాంగ్‌తో నటిపై ఇదంతా చేయించింది దిలీప్ అని మీడియాలో చాలా కాలంగా కథనాలు వస్తున్నాయి. కానీ ఇపుడు దిలీప్ పల్సర్ సునీల్ మీద ఫిర్యాదు చేయడంతో అంతా అయోమయంలో పడ్డారు.

  అంతా సినిమా డ్రామాలా...

  అంతా సినిమా డ్రామాలా...

  నటిపై జరిగిన ఈ దాడికేసుకు సంబంధించిన పరిణామాలు పరిశీలిస్తే ఇదేదో సినిమా డ్రామాలా ఉందని అంటున్నారు. పోలీసు విచారణలో త్వరలోనే అసలు నిజాలు వెల్లడి కానున్నాయి.

  తొలిసారి స్పందించిన నటి

  తొలిసారి స్పందించిన నటి

  ఫిబ్రవరిలో సంఘటన జరుగగా.... ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్నడూ మీడియాతో నటి మాట్లాడలేదు. తాజాగా తన గురించి వచ్చిన ఓ ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. దిలీప్ కొన్ని రోజుల క్రితం ఓ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో ఆ నటి, జైలులో ఉన్న పల్సర్‌ సునిల్ స్నేహితులని వ్యాఖ్యానించారు. దీనిపై ఆ నటి తీవ్రంగా స్పందించారు.

  కేసు పెడతానంటూ వార్నింగ్

  కేసు పెడతానంటూ వార్నింగ్

  ‘నేను, ఈ కేసులో నిందితుడు పల్సర్‌ సునిల్ స్నేహితులమని.... స్నేహితులను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఓ నటుడు నన్ను ఉద్దేశించి అన్నట్లు తెలిసింది.. ఇది నన్ను చాలా బాధించింది. నాపై ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తే.. అవసరమైతే చట్టపరంగా చర్యలు తీసుకోగలను' అని నటి వార్నింగ్ ఇచ్చారు.

  English summary
  Popular Malayalam actor Dileep was questioned by the police for more than 12 hours on Wednesday in connection with the abduction and sexual assault of an actress. Dileep entered the Aluva Police Club at 12.30pm with director-friend Nadirsha and left the premises at 1.06am.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X