రోజుకు రూ.4 లక్షల రెమ్యునరేషన్.. అందువల్లే మోసపాయాను: షకీలా షాకింగ్ కామెంట్స్

ఒకప్పటి బోల్డ్ బ్యూటీ నటి షకీలా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ లో కూడా ఆమె శృంగార నటిగా పేరు తెచ్చుకుంది. గతంలో ఆమె బీ గ్రేడ్ రొమాంటిక్ చిత్రాల్లో నటించి... పాపులర్ అయింది. షకీలా నటించిన రొమాంటిక్ చిత్రాలకు అప్పట్లో కలెక్షన్లు భారీగా వచ్చేవి. కాగా చాలా ఏళ్ల విరామం తర్వాత ఇప్పుడు విజయ్ టీవీలో కూకు విత్ కోమలి అనే తమిళ రియాల్టీ షో ద్వారా షకీలా మళ్లీ బుల్లితెర ముందుకు వచ్చింది. ఈ షోకు మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలో ఓ ఇంటర్య్వూలో షకీలా కొన్ని విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా ఆమె గతంలో తన ఆస్తుల గురించి ఆదాయం గురించి వివరణ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

అప్పట్లో భారీగా ఆదాయం:90ల కాలంలో అలాగే ఆ తరువాత 15 ఏళ్ళ వరకు కూడా షకీలా కెరీర్ ఒక రేంజ్ లో కోనసాగింది. నటిగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను అందుకోవాలి అనుకున్న షకీలా ఎలాంటి సినిమా చేసినా కూడా అప్పట్లో భారీగా ఓపెనింగ్స్ వచ్చేవి. ఆమె మలయాళంలో చేసిన బీ గ్రేడ్ సినిమాల ద్వారా చాలా మంది నిర్మాతలు సెటిల్ అయ్యారు. ఇక షకీలా కూడా మంచి రెమ్యునరేషన్ అందుకుంటూ తన ఫ్యామిలీ మొత్తం సెటిల్ అయ్యేలా చేసింది.

Actress shakeela about her remuneration and assets details

బీఎండబ్ల్యూ కార్లు, విలాసవంతమైన ఫ్లాట్లు:అయితే కొన్నాళ్ళకు షకీలా ఎలాంటి ఆస్తి లేకుండా కనీసం కుటుంబం నుంచి సపోర్ట్ లేకుండా మిగిలింది. అయితే తన వద్ద బీఎండబ్ల్యూ కార్లు, విలాసవంతమైన ఫ్లాట్లు ఉన్నట్టు కొన్ని అవాస్తవాలు ప్రచారం అవుతున్నాయని షకీలా ఇటీవల చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తనకు సొంత ఇల్లు కూడా వెల్లడించింది. తన గురించి చాలా తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. తనకు లగ్జరీ ఫ్లాట్ ఉందని, బీఎండబ్ల్యూ కార్లు ఉన్నాయని ప్రచారం జరుగుతోందన్నారు.

Actress shakeela about her remuneration and assets details

అద్దె ఇంట్లో ఉంటున్నట్లు చెప్పిన షకీలా:అయితే, అది వాస్తవం కాదని తాను ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నట్లు షకీలా చెప్పారు. కుటుంబ సభ్యులే తనను మోసం చేశారని షకీలా ఆవేదన వ్యక్తం చేసింది. ఐటీ దాడులు జరుగుతాయని భయపెట్టి తన సోదరే తన డబ్బు దోచుకుందని షకీలా తెలిపారు. తాను రోజుకు రూ.4లక్షలు సంపాదించే దాన్ని అని చెప్పారు. అయితే తన సోదరి డబ్బు అంతా తీసుకుందని ఆరోపించారు. తనకు ఏమీ లేకుండా చేసిందని షకీలా చెప్పారు.

Actress shakeela about her remuneration and assets details

ఆ హీరో అడ్డుకునేవారు:మలయాళ సూపర్ స్టార్ మమ్మూటీ తన సినిమాలను గతంలో రిలీజ్ కాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించే వారని షకీలా ఇటీవల ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా తక్కువ బడ్జెట్‍తో రూపొందినా తన సినిమాలు.. సూపర్ స్టార్లు ఉన్న చిత్రాలకు పోటీని ఇచ్చేవి అని తెలిపారు. అయితే, ఈ విషయంలో మమ్ముట్టి ఆగ్రహంగా ఉండే వారని తనకు తెలిసింది అని చెప్పింది. తన చిత్రాల విడుదలకు ఆయన ఆటంకం కలిగించే వారని ఆరోపించింది. అప్పట్లో షకీలా నటించే శృంగార చిత్రాలకు మంచి క్రేజ్ ఉండేది. మలయాళంలో మంచి కలెక్షన్లు సాధించేవి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X