23 ఏళ్లకే అన్ని చూసేశా.. అందుకే పెళ్లి కాకుండానే తల్లినయ్యా: తొలిసారి ఎఫైర్లు బయటపెట్టిన షకీలా
షకీలా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఈమె బీ గ్రేడ్ సినిమాల్లో నటించి దేశ వ్యాప్తంగా పాపులర్ కావడమే. దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే స్టార్ హీరోలతో సైతం పోటీగా తన సినిమాలను విడుదల చేస్తూ ఈమె ప్రేక్షకాదరణను పొందింది. తద్వారా వయసుతో సంబంధం లేకుండా ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. అంతటి పేరు సంపాదించిన షకీలా.. కొంత కాలంగా ఎన్నో కష్టాలను అనుభవిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో షకీలా తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను బయట పెట్టేసింది. ఆ వివరాలు మీకోసం!
ఇండియాలో ఏకైక శృంగార తార:షకీలా 1994 నుంచి దాదాపు ఇరవై సంవత్సరాల పాటు ఇండియన్ సినిమాపై ప్రభావాన్ని చూపుతూ హాట్ టాపిక్‌గా నిలిచారు. కేవలం బీ గ్రేడ్ సినిమాల్లో నటిస్తూ విపరీతమైన ఫాలోయింగ్‌ను అందుకున్నారు. తన ప్రతి సినిమాకూ హౌస్‌ఫుల్ బోర్డులు పడేలా ఆమె రెచ్చిపోయి యాక్టింగ్ చేశారు. ఈ కారణంగానే భారతదేశంలోనే ఏకైక శృంగార తారగా అప్పట్లో షకీలా సెన్సేషన్ అయ్యారు.

ప్రేమ వ్యవహారాల వల్లే కోల్పోయి:షకీలా ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి గతంలో ఆమె ప్రేమలు విఫలం అవడమే కారణం అని తెలిసిందే. ఈ శృంగార తార ఇప్పటి వరకు ఏడెనిమిది మందితో ప్రేమాయణం సాగించింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పారు. అయితే, వాళ్లంతా పెళ్లి చేసుకోడానికి మాత్రం సిద్ధ పడలేదని కూడా షకీలా పలుమార్లు వెల్లడించారు. అలాగే, ఆస్తులు కాజేశారని కూడా పేర్కొన్నారు.
వాళ్లు ఎవరూ నాతో లేరంటూ:తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షకీలా 'నేను బీ గ్రేడ్ సినిమాలు చేసి కష్టపడింది మొత్తం నా ఫ్యామిలీ కోసమే. అప్పుడు నేను ఎవరి కోసం అయితే కష్టపడ్డానో వాళ్లు ఎవరూ ఇప్పుడు నాతో లేరు. డబ్బు ఉన్నప్పుడే మనతో ఉంటారు. నాకు తినడానికి ఉండటానికి ఇబ్బంది లేదు కానీ.. నా అన్న వాళ్లు నాతో లేరు. వైవాహిక జీవితం అనేది మన చేతుల్లో లేదు' అని చెప్పుకొచ్చారు.

23 ఏళ్లకే అన్నీ చూసేశానంటూ:ఇదే ఇంటర్వ్యూలో షకీలా 'నేను 23 ఏళ్లకే అన్నీ చూసేశాను. చిన్న వయసులోనే స్టార్‌డమ్ వచ్చింది. ఐదు కార్లు, ఇళ్లు కొన్నా. అన్నీ వచ్చేశాయి. ఆర్ధికంగా ఇబ్బందేం లేదు. అందరిలాగే నాకూ అనిపిస్తుంది. నాక్కూడా ఓ ఫ్యామిలీ ఉంటే బాగుండు అని. పిల్లలు ఉంటే బాగుండు. అమ్మ అని పిలిచేవాళ్లు ఉంటే బాగుండు అని ప్రతిసారి అనిపిస్తుంది' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
వాళ్లంతా మోసం చేసి వెళ్లారు:షకీలా కంటిన్యూ చేస్తూ.. 'నేను చాలామందిని లవ్ చేశా. నేను ప్రేమించిన వాళ్లంతా ఒక్కొక్కరుగా మోసం చేసి వెళ్లిపోయారు. మా అమ్మ మాతో ఉండకూడదని కండిషన్స్ పెట్టేవారు. అమ్మ కోసం అందర్నీ వదిలేస్తే.. ఆమె నన్ను వదిలేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత అన్నయ్య ఫ్యామిలీ భారం నాపై పడింది. తర్వాత ఆయన చనిపోయాడు. ఆ పిల్లల్ని నేను చూసుకున్నా' అని చెప్పారు.

పెళ్లి కాకుండానే తల్లినయ్యా:షకీలా కొనసాగిస్తూ.. 'నేను ట్రాన్స్ జెండర్స్‌ని దత్తత తీసుకున్నాను. అలా పెళ్లి కాకుండానే తల్లినయ్యాను. వాళ్లకు పెళ్లిళ్లు చేస్తున్నాను. నాకు యాంకరింగ్ అంటే చాలా ఇష్టం. ఓ ఛానల్‌లో యాంకరింగ్ చేస్తున్నా. తెలుగులోనూ సినిమాలు చేయాలని ఉంది. షకీలా అమ్మకు ఏ వేషం ఇచ్చినా చేయడానికి రెడీగా ఉన్నాను' అంటూ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











