బెడ్రూంలో కోరిక తీరుస్తావా? తెలుగు డైరెక్టర్ పై షకీలా సంచలన కామెంట్
Actress Shakeela:మలయాళ ఇండస్ట్రీలో మహిళా నటులపై లైంగిక వేధింపులకు సంబంధించి జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టుతో సినీ పరిశ్రమలో ప్రకంపనలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు ఈ రిపోర్టుపై స్పందిస్తున్నారు. తాము ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న పలు చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. గతంలో తమకు ఎదురైన వేధింపులను బయటకు చెప్తున్నారు. ఈ క్రమంలో పలువురు సెలబ్రెటీలపై కేసులు నమోదయ్యాయి. పలువురు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ నటి షకీలా షాకింగ్ కామెంట్ చేసింది.
నటి షకీలా షాకింగ్ కామెంట్స్
జస్టిస్ హేమ కమిటీ రిపోర్టుపై తాజాగా ప్రముఖ నటి షకీలా స్పందించారు. ఆమె ఓ టీవీ ఇంటర్య్వూలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు కేవలం మలయాళ ఇండస్ట్రీకే పరిమితం కాదనీ, తమిళం, తెలుగు ఇండస్ట్రీల్లో కూడా చాలామంది వేధింపులను ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా సినీ ఇండస్ట్రీలో మహిళలు ఎదురవుతున్న లైంగిక వేధింపుల వ్యవహారాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని షకీలా చెప్పారు.

తనకు టాలీవుడ్‌లోని ఓ స్టార్ డైరెక్టర్ నుంచి ఇలాంటి అనుభవం ఎదురైందని షకీలా చెప్పింది. అతని దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించాననీ, ఆ సమయంలో ఆయన తనని అలా రమ్మని అడిగారనీ, అలా చేస్తే నా తర్వాతి సినిమాలో కూడా నీకే అవకాశం వస్తుందన్నారని, కానీ దానికి నో చెప్పాననీ, అందుకనే ఆ డైరెక్టర్ సినిమాల్లో కనిపించనని షకీలా షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సౌత్ స్టార్ హీరోయిన్ గా షకీలా
ప్రముఖ నటి షకీలా ఒకప్పుడూ సౌత్ ఇండియా ఫీల్మ్ ఇండస్ట్రీలో సెన్సేషనల్ హీరోయిన్ గా రాణించింది. ఆ నాటి స్టార్ హీరోలకు దీటుగా వెలుగొందింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాలు నటించింది. ఆమె నటించిన కిన్నర తుంబికల్ ఆరు భాషల్లో డబ్ అయ్యింది. ఈ మూవీ కేవలం రూ. 12 లక్షల బడ్జెట్ తో తెరకెక్కగా ఏకంగా రూ. 4 కోట్లు వసూలు చేసి పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఆ తరువాత ఇండస్ట్రీకి దూరమైంది. గతేడాది కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్-7లో ఆమె కంటెస్టెంట్‌గా పాల్గొంది. కానీ రెండో వారంలో ఎలిమినేట్ అయింది. సినిమాలకు దూరంగా ఉన్న ఆమె అప్పుడప్పుడూ ఇండస్ట్రీ సమస్యలపై స్పందిస్తూ మీడియాలో కనిపిస్తోంది.

హేమ కమిటీ రిపోర్టు ప్రకంపనలు
మలయాళ ఇండస్ట్రీలో మహిళా నటులపై లైంగిక వేధింపులకు సంబంధించి జస్టిస్ హేమ కమిటీ తన రిపోర్టును కేరళ సీఎం పినరయి విజయన్ కు అందించింది. ఈ రిపోర్టు ద్వారా ఇండస్ట్రీలో మహిళ నటులు, జూనియర్ ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న 17 రకాల ఇబ్బందుల గురించి వెల్లడించింది. సినీ రంగంలో అవకాశాలు రావాలంటే.. లైంగిక వేధింపులను భరించాల్సి వస్తుందని వివరించింది. మలయాళీ ఇండస్ట్రీ కొంతమంది నిర్మాతలు, దర్శకులు, నటుల నియంత్రణలో ఉందని వెల్లడించింది.


Click it and Unblock the Notifications











