»   » ఎంగేజ్మెంట్: డైరెక్టర్‌ను పెళ్లాడబోతున్న తెలుగు హీరోయిన్(ఫోటో)

ఎంగేజ్మెంట్: డైరెక్టర్‌ను పెళ్లాడబోతున్న తెలుగు హీరోయిన్(ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్లు పరిశ్రమకు చెందిన నిర్మాతలు, దర్శకులు లేదా హీరోలను తమ భాగస్వాములుగా ఎంచుకోవడం, వారితో ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో తెలుగు హీరోయిన్ కూడా ఇదే దారిలో ప్రయాణించింది. దర్శకుడిని పెళ్లాడబోతోంది.

తెలుగులో చందమామ కథలు, కాయ్ రాజా కాయ్ తదితర చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసిన హీరోయిన్ శామిలి సౌందెరాజన్.... బెస్ట్ యాక్టర్స్ దర్శకుడు అరుణ్ పవార్‌ను పెళ్లాడబోతోంది. ఇటీవలే ఇద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అరుణ్ పవర్ దర్శకత్వం వహిస్తున్న ‘బెస్ట్ యాక్టర్స్' చిత్రంలో శామిలి సౌందెరాజన్ లీడ్ హీరోయిన్ గా నటిస్తుండటం గమనార్హం.

 Actress Shamili Gets Engaged To Director Arun Pawar

ఇద్దరూ ఎలా ప్రేమలో పడ్డారు? ‘బెస్ట్ యాక్టర్స్' సినిమా సెట్లోనే ప్రేమ మొదలైందా? అనే ప్రశ్నకు శామిలి స్పందిస్తూ..... అరుణ్ పవార్ స్వయంగా వచ్చి మా అమ్మతో నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగారు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది అంటూ శామిలి చెప్పుకొచ్చింది.

త్వరలోనే వీరి పెళ్లికి సంబంధించిన వివరాలు ప్రకటించనున్నారు. టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం జరుగబోతోంది. పెళ్లి తర్వాత కూడా శామిలి హీరోయిన్ గా తన కెరీర్ కొనసాదించాలని నిర్ణయించుకుంది. ఇందుకు అరుణ్ పవార్ మద్దతు కూడా ఉంది. ఈ విషయం చెప్పే శామిలిని ప్యామిలీని ఒప్పించాడట.

English summary
Actress Shamili Sounderajan, who sizzled in many films in no time, got engaged to Best Actors director, Arun Pawar. The actress was predominantly seen in the films like Chandamama Kathalu, Lovers and Kai Raja Kai. The interesting part of the tale of Shamili is she has also played the leading lady of Arun Pawar's Best Actors.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu