లాక్‌డౌన్‌లో‌ యంగ్ హీరోయిన్ సరదా షికార్లు.. ప్రమాదానికి గురై నుజ్జునుజ్జయిన కారు.. తీవ్రగాయాలు

ప్రభుత్వం విధించిన ఈ లాక్‌డౌన్‌ సమయంలో సరదా షికార్లు చేసి యంగ్ హీరోయిన్ షర్మిలా మాండ్రే రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో ఆ హీరోయిన్‌కి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. మరి ఆ ప్రమాదం ఎలా జరిగింది. కారులో ఎవరెవరున్నారు? ఆ వివరాలు చూస్తే..

స్నేహితుడు లోకేశ్ వసంత్‌తో కారులో హీరోయిన్..

స్నేహితుడు లోకేశ్ వసంత్‌తో కారులో హీరోయిన్..

హీరోయిన్ షర్మిలా మాండ్రే తన స్నేహితుడు లోకేశ్ వసంత్‌తో కలిసి జాగ్వర్ కారులో ప్రయాణిస్తుండగా ఊహించని విధంగా ఈ ప్రమాదం జరిగింది. బెంగళూరులోని వసంత్‌ నగర్‌ రైల్వే బ్రిడ్జి వద్ద ఉదయం 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది.

ఓ స్తంభాన్ని బలంగా ఢీ కొట్టడంతో..

ఓ స్తంభాన్ని బలంగా ఢీ కొట్టడంతో..

వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న ఓ స్తంభాన్ని బలంగా ఢీ కొట్టడంతో కారు ముందు భాగం నుజ్జనుజ్జయింది. దీంతో షర్మిలతోపాటు ఆమె ఫ్రెండ్ లోకేష్ వసంత్‌‌ తీవ్ర గాయాలపాలయ్యాడు. షర్మిల, లోకేష్‌‌లను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.

పోలీసుల విచారణ.. మద్యం సేవించారా?

పోలీసుల విచారణ.. మద్యం సేవించారా?

లాక్ డౌన్ అమల్లో ఉన్న వేళ వేకువజామున 3 గంటల సమయంలో వీరు బయట ఎందుకు తిరుగుతున్నట్లు? ఆ సమయంలో ఎక్కడికి వెళ్లివస్తున్నారన్న విషయమై పోలీసులు విచారిస్తున్నారు. అలాగే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఈ ఇద్దరూ మధ్యం సేవించి ఉన్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. పూర్తివివరాలు ఇంకా తెలియరాలేదు.

Recommended Video

Prabhas - The Charity King In Tollywood | Filmibeat Telugu
హీరోయిన్ 'కెవ్వు కేక'

హీరోయిన్ 'కెవ్వు కేక'

హీరోయిన్ షర్మిలా మాండ్రే తెలుగులో ‘కెవ్వుకేక' సినిమాలో నటించింది. అల్లరి నరేష్‌ హీరోగా 2013లో రూపొందిన ఈ సినిమా ఆమెకు పెద్దగా అవకాశాలు తెచ్చిపెట్టకపోవడంతో తన సొంత భాష కన్నడ సినిమాలవైపు మొగ్గు చూపింది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X