twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రేప్ కి రెడీ..భయం లేదు అంటున్న సెక్సీ భామ

    By Srikanya
    |

    ముంబై : "డియర్ హేటర్స్ ,నేను రేప్ అవ్వాలని కోరుకుంటున్నారా...నిజంగా నా రేప్ తో భారత దేశంలోని అమ్మాయిల పై అత్యాతారాలు ఆగిపోతాయంటే, నేను రేప్ కు రెడీ, నాకు భయం లేదు.." అంటూ బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా తన ట్విట్టర్ లో డిల్లీ గ్యాంగ్ రేప్ ఇష్యూపై స్పందించింది.

    మరో హీరోయిన్ శ్రియ డిల్లీ గ్యాంగ్ రేప్ విషయమై స్పందిస్తూ... ఈదేశంలోని అమ్మాయిలు నిర్భయంగా తిరగాలంటే చట్టాలు మార్చాల్సిందే. అంతకంటే ముందు... మన దృక్పథాల్లో మార్పు రావాలి'' అంటోంది శ్రియ. ఢిల్లీ దుర్ఘటన ఆమెను తీవ్రంగా కలచివేసిందట. ఆమె స్పందిస్తూ ''మనం మానవ సమాజంలోనే బతుకుతున్నామా? అనే అనుమానం వేస్తోంది. సమాన హక్కుల మాట పక్కన పెట్టండి అంది.

    అలాగే ఈ దేశంలో స్వేచ్ఛగా తిరిగే అవకాశం కూడా దొరకడం లేదు. నేనూ పురుషాహంకారాన్ని చవిచూసిన దాన్నే. అయితే ధైర్యంగా నిలబడ్డాను. అమ్మాయిల్ని మానసికంగా ధృడపరచాల్సిన బాధ్యత తల్లితండ్రులదే. వారిలో ఉండే భయాలు పోగొట్టండి. స్వీయ రక్షణ విధానాలు తెలపాలి. ఈ దేశంలో అమ్మాయిల భద్రత కేవలం ప్రభుత్వాల చేతుల్లోనే లేదు. తల్లికీ, అక్కకీ ఇచ్చే గౌరవం ప్రతీ అమ్మాయికీ ఇచ్చేలా మన పిల్లలకు తెలియజేయాలి'' అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది.

    అమానత్‌ మృతికి దేశ వ్యాప్తంగా పలువురు బాలీవుడ్‌ నటులు వేర్వేరు మాధ్యమాల ద్వారా తమ సంతాపాన్ని తెలిపారు. దిగ్భ్రాంతి..ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దేశానికి చాలా అవమానకర ఘటనని అభివర్ణించారు.
    ఎవరు ఏమన్నారో వారి వ్యాఖ్యల్లోనే

    ''ఈ సంస్కృతి, సమాజంలో నేను భాగమైనందుకు క్షమించండి. నేను పురుషుడైనందుకు మన్నించండి. ఇక నేనూ మీ గళంతో కలిసిపోరాడుతాను.''
    - షారూక్‌ఖాన్‌ (నటుడు)
    ''అమానత్‌, దామిని.. పేర్లు మాత్రమే. ఆమె ఇక లేరు. చనిపోయారు. కాని ఆమె ఆత్మ మన హృదయాలను కలచివేస్తూనే ఉంటుంది.''
    - అమితాబ్‌బచ్చన్‌ (నటుడు)
    '' నేను భారతీయుడిగా ఎప్పుడూ గర్వించేవాడిని. కాని ఈ రోజు అందరూ తలదించుకోవాల్సి వచ్చింది. నేను బాల్యంలో చూసిన దేశమిది కాదు. మా కుమార్తె తెలుసుకోవాల్సిన, పెరగాల్సిన దేశం ఇది కాదు.''
    - అభిషేక్‌బచ్చన్‌ (నటుడు)
    '' ఇది అమానత్‌ మృతి కాదు. దేశంలో మానవత్వం మృతి. ప్రభుత్వం మేల్కోవాల్సిన సమయం వచ్చింది. క్రూరమైన నేరానికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలి.''
    - లతామంగేష్కర్‌ (గాయని)
    '' ఇది మానవత్వం మంటకలిసిన రోజు. అమాయకత్వం, దేశ వ్యవస్థ మృతి చెందింది. భారత గుండె చెదిరింది.''
    - అనుపమ్‌ఖేర్‌ (నటుడు-దర్శకుడు)
    '' విప్లవం కోసం ఎవరో ఎందుకు చనిపోవాలి. ఆమె త్యాగం వృథాకాదని భావిస్తున్నా.''
    - అజయ్‌దేవగణ్‌ (నటుడు)
    '' ఆమె మృతివార్తతో గుండెపలిగింది. వీరనారి ఆత్మకు శాంతి కలగాలి.''
    - బిపాసాబసు (నటి)
    '' దయచేసి ఆమె పోరాటాన్ని వృథాకానివ్వకండి. ఆమెపై దారుణం దేశానికి అవమానకరం.''
    - సోనంకపూర్‌ (నటి)
    '' ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు.''
    - మధుర్‌ బండార్కర్‌ (చలన చిత్ర నిర్మాత)'''

    English summary
    
 
 Sexy actress Sherlyn Chopra, who posed nude for Playboy magazine recently, now made a controversial statement on Twitter following to the Delhi Gang Rape incident.She said that ” Dear HATERS, u say that I should be raped. IF my rape can guarantee no further rapes ofndia’s daughters, then I am ready by all means# No fear” Sherlyn posted on Twitter. So, once again the hot actress is trying to hog limelight using this tragic Delhi Gang Rape incident.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X