For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాజమౌళికి షాకిచ్చిన బాలీవుడ్ హీరోయిన్.. జక్కన ఆఫర్‌కు నో!

|
#RRRMovieUpdates : After Daisy Edgar Jones, Shraddha Kapoor Declines SS Rajamouli's Offer

ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న RRR సినిమాకు సంబంధించి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి మరోసారి చుక్కెదురైంది. ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ నుంచి బ్రిటీష్ అందాల సుందరి డైసీ ఎడ్గర్ జోన్స్ తప్పుకొన్న తర్వాత మరో హీరోయిన్ కోసం జక్కన్న వేట ప్రారంభించారు. శ్రద్ధాకపూర్, పరిణితి చోప్రా లాంటి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్న శ్రద్ధాకపూర్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఈ సినిమా ఆఫర్‌ను ఆమె తిరస్కరించినట్టు వచ్చిన వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే...

హీరోయిన్ వేటలో రాజమౌళి

దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో ఒక్క ఛాన్స్ దొరికితే చాలూ అనే చాలా మంది ఎదురుచూస్తుంటారు. అలియాభట్ లాంటి క్రేజీ, టాలెంటెడ్ హీరోయిన్లు అవకాశం ఇవ్వమని ప్రాధేయపడినట్టు ఇటీవల స్పష్టమైంది. అలాంటిది తాను కోరకముందే తన ముందుకు వచ్చిన ఆఫర్‌ను శ్రద్ధాకపూర్ ఎందుకు రిజెక్ట్ చేసిందనే చర్చ మొదలైంది. శ్రద్ధాకపూర్ రిజెక్ట్ చేయడం వెనుక కారణం సరైందనే మాట వినిపిస్తున్నది.

సున్నితంగా తిరస్కరించిన శ్రద్ధా కపూర్

బాలీవుడ్‌లో అత్యంత బిజీగా మారిన హీరోయిన్లలో శ్రద్ధాకపూర్ ఒకరు. సాహో చిత్రం కోసం సుదీర్ఘంగా పనిచేస్తున్నారు. పలు ప్రాజెక్టుల కోసం డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. అయితే RRR సెన్సేషనల్ ప్రాజెక్ట్ కావడం, అందుకోసం భారీగా డేట్స్ కేటాయించి రావడం ఆమెకు సమస్యగా మారినట్టు తెలిసింది. అందుకోసమే రాజమౌళి ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం.

హీరోయిన్ సీన్లు వచ్చే షెడ్యూల్‌కు

RRR కథలో భాగంగా హీరోయిన్‌ది బ్రిటీష్ యువతి పాత్ర అని తెలిసింది. అందుకోసమే డైసీ ఎడ్గర్ జోన్స్‌ను రంగంలోకి దించారు. కానీ కుటుంబ కారణాలు చెప్పి ఈ సినిమాకు ముఖం చాటేసింది. విదేశీ యువతి దొరకని పక్షంలో కథలో మార్పులు చేసి ఇండియన్ హీరోయిన్‌కు అనుకూలంగా స్టోరిని మార్చే ప్రయత్నం చేస్తున్నారనే వార్త కూడా బయటకు వచ్చింది. అంతేకాకుండా ప్రస్తుత షెడ్యూల్‌లో హీరోయిన్ కన్ఫర్మ్ కాకపోతే వచ్చే షెడ్యూల్‌లో హీరోయిన్ పాత్రకు సంబంధించిన సీన్లను ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.

‘మహేష్ 26' అగ్రిమెంట్ లీక్.. రంగంలోకి నమ్రత, నిర్మాత టచ్ చేయడట, అతడి వాటా అంతేనా?

10 భారతీయ భాషల్లోకి

చారిత్రక నేపథ్యం ఉన్న ఫిక్షనల్‌ స్టోరీగా RRR చిత్రం తెరకెక్కుతున్నది. దాదాపు 10 భారతీయ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం సుమారు రూ.300 కోట్లతో తెరకెక్కుతున్నది. ఈ చిత్రాన్ని 2020 జూలై 30 తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి వెల్లడించారు. ప్రస్తుతం తాజా షెడ్యూల్ గుజరాత్‌లో జరుగుతున్నది.

అల్లూరిగా రాంచరణ్.. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్

RRR చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఆదివాసీ గిరిజన పోరాట యోధుడు కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఒకే కాలంలో వేర్వేరు ప్రాంతాల్లో పోరాటం చేసిన స్వతంత్ర్య పోరాట యోధుల జీవిత కథకు ఫిక్షనల్ అంశాలు జోడించి తెరకెక్కిస్తున్నట్టు రాజమౌళి ఇటీవల మీడియా ముందు వెల్లడించిన సంగతి తెలిసిందే.

English summary
British actor Daisy Edgar Jones made news after she exited filmmaker SS Rajamouli's upcoming film RRR due to 'unavoidable circumstances.' Since then the makers have been hunting for other faces. A while ago Bollywood actors Shraddha Kapoor and Parineeti Chopra's names were tossed up as contenders to replace Daisy. However now it seems Shraddha is out of the race as she has decided to give the film a pass.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more