డబ్బు కోసం ప్రియున్ని హత్య చేయించిన హీరోయిన్ (ఫోటోలు)
హైదరాబాద్: డబ్బు కోసం ప్రియుడిని హత్య చేయించిన సినిమా నటి ఘాతుక చర్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెంగుళూరుకు చెందిన నటి శృతి చంద్ర లేఖ ఈ దారుణానికి పాల్పడింది. తొలుత ఏమీ ఎరుగనట్లు ప్రవర్తించిన శృతి చంద్రలేఖ....పోలీసులు విషయం పసిగట్టడంతో పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.
శృతి చేతిలో హత్యకు గురైంది తమిళ నటుడు పీటర్ ప్రిన్స్. నెల్లై జిల్లా పరప్పాడికి చెందిన రొనాల్డ్ పీటర్ ప్రిన్స్ (35) కొన్ని సినిమాల్లో సహాయ నటుడిగా నటించాడు. ఇతనికి బెంగళూరుకు చెందిన నటి శృతి చంద్రలేఖతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు చెన్నై మదురవాయల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.
జనవరి 13న నెల్లైకి వచ్చి అక్కడి నుంచి చెన్నైకి వస్తున్న పీటర్ ప్రిన్స్ హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. ఫిబ్రవరి 1వ తేదీ ఆయన కనబడలేదని శృతి మదురవాయల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలాగే తన తమ్ముడు కనబడలేదని పీటర్ ప్రిన్స్ సోదరుడు జస్టిన్ పాళయంకోట్టై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు జరిపిన విచారణలో శృతి, కిరాయి ముఠా ద్వారా పీటర్‌ను హత్య చేసి పాళయంకోటైలో పాతిపెట్టినట్లు తెలిసింది.

కిరాయి ముఠా ద్వారా
కిరాయి ముఠా ద్వారా శృతి ఈ పని చేయించినట్లు పోలీసులు తేల్చారు. కిరాయి ముఠాకు చెందిన ఆన్సట్రాజ్, గాంధిమదినాథన్ రబీక్ ఉస్మాన్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

చంపి పాతి పెట్టారు
ఆశీర్వాద నగర్‌లో పాతిపెట్టిన పీటర్ ప్రాన్సెస్ మృతదేహాన్ని తవ్వి బయటకు తీసి శవ పరీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో ఈ కేసులో ముఖ్య నిందితుడైన జాన్ ప్రిన్సెస్‌ను పాళయంకోట పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

జాన్‌ప్రిన్సెస్ పోలీసులకు అందించిన వివరాలు
తాను, పీటర్, ఉమాచంద్రన్ కలిసి ఆన్‌లైన్ వ్యాపారంలో నగదు డిపాజిట్ చేశామని, అయితే అందులో నష్టం రావడంతో పీటర్ తమని వదలి బెంగళూరుకు వెళ్లి కోట్ల రూపాయలు సంపాదించినట్లు జాన్ ప్రిన్సెస్ పోలీసులకు తెలిపాడు.

డబ్బు కోసమే...
శృతితో పీటర్‌కు పరిచయం ఏర్పడి మదురవాయల్‌లో కాపురం పెట్టారు. ఈ క్రమంలో పీటర్‌కు మరికొంతమంది యువతులతో పరిచయం ఏర్పడింది. దాంతో పీటర్, శృతిల మధ్య విభేదాలు వచ్చాయి. పీటర్‌కు చెందిన కోట్ల రూపాయలు దక్కించుకోవాలని శృతి పథకం వేసింది. దీనికి శృతి తమను ఆశ్రయించినట్లు జాన్ ప్రిన్సెస్ తెలిపాడు.

విషం ఇచ్చి, గొంతు నులుమి
తాముకూడా పీటర్ వల్ల నష్టపోవడంతో అతన్ని కిడ్నాప్ చేసి విషం ఇవ్వడంతో పాటు, గొంతి నులిపి చంపారు.ఆ తర్వాత ఉమాచంద్రన్, ఆన్‌స్టడ్ రాజ్ సాయంతో పీటర్ మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి ఆశీర్వాదం అనే ప్రాంతంలో పాతి పెట్టారు


Click it and Unblock the Notifications











