»   » మూడు పదుల్లోనూ శృతి హాసన్ సెక్సీ లుక్ (బర్త్ డే స్పెషల్)

మూడు పదుల్లోనూ శృతి హాసన్ సెక్సీ లుక్ (బర్త్ డే స్పెషల్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కమల్ హాసన్ వారసురాలిగా హీరోయిన్‌గా తెరంగ్రేటం చేసిన శృతి హాసన్... తనదైన టాలెంట్, అందంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. నేటితో శృతి హాసన్ 30వ వసంతంలోకి అడుగు పెడుతోంది. శృతి హాసన్ పూర్తి పేరు శృతి రాజ్యలక్ష్మి హాసన్. ప్రముఖ నటుడు కమల్ హాసన్, సారిక దంపతులకు జనవరి 28, 1986లో జన్మించింది. ఆమె కేవలం నటి మాత్రమే కాదు...మంచి సింగర్, మ్యూజిక్ కంపోజర్ కూడా.

కమల్ హాసన్ కూతురుగా తెరంగ్రేటం చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది హీరోయిన్ శృతి హాసన్. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో గడ్డుకాలం ఎదుర్కొన్నప్పటికీ ఓపికతో ముందుకు సాగుతూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. నటన పరంగానే కాదు...గ్లామర్ పరంగా కూడా తనదైన ముద్ర వేస్తూ దూసుకెలుతోంది.

బాలీవుడ్ మూవీ ‘లక్' చిత్రం ద్వారా శృతి హాసన్ 2009లో హీరోయిన్‌గా కోరీర్ ప్రారంభించింది. అయితే తొలి చిత్రం ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలేవీ రాలేదు. ఆ తర్వాత 2011లో ‘అనగనగా ధీరుడు' చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం కూడా ఆమెకు నిరాశనే మిగిల్చింది.

దశ తిరిగింది కారణం ఏమిటో తెలియదు కానీ మొదట చేసిన 7 సినిమాలకు శృతి హాసన్‌కు కలిసిరాలేదు. 2012లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రం ద్వారా తొలి విజయం రుచి చూసింది. ఆ తర్వాత ఆమె పలు సినిమాలతో బిజీ అయింది.

ప్రస్తుతం శృతి హాసన్ సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘సింగం-3' చిత్రంలో నటిస్తోంది. హిందీలో యాత్ర, రాకీ హాండ్సమ్ చిత్రాల్లో నటిస్తోంది. దీంతో పాటు తెలుగులో చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది.

శృతి హాసన్

శృతి హాసన్

30వ వడిలోనూ శృతి హాసన్ సెక్సీ లుక్‌తో దూసుకెలుతోంది.

బర్త్ డే

బర్త్ డే

కమల్ హాసన్, సారిక దంపతులకు జనవరి 28, 1986లో జన్మించింది.

మల్టీ టాలెంటెడ్

మల్టీ టాలెంటెడ్

ఆమె కేవలం నటి మాత్రమే కాదు...మంచి సింగర్, మ్యూజిక్ కంపోజర్ కూడా.

తెరంగ్రేటం

తెరంగ్రేటం

బాలీవుడ్ మూవీ ‘లక్' చిత్రం ద్వారా శృతి హాసన్ 2009లో హీరోయిన్‌గా కోరీర్ ప్రారంభించింది.

స్టార్ స్టేటస్

స్టార్ స్టేటస్

2012లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రం ద్వారా తొలి విజయం రుచి చూసింది. ఆ తర్వాత ఆమె పలు సినిమాలతో బిజీ అయింది.

ప్రస్తుతం

ప్రస్తుతం

‘సింగం-3' చిత్రంలో నటిస్తోంది. హిందీలో యాత్ర, రాకీ హాండ్సమ్ చిత్రాల్లో నటిస్తోంది. దీంతో పాటు తెలుగులో చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది.

English summary
Actress Shruti Hassan Turns 30. Shruti Haasan is an Indian film actress, singer and musician known for her works in Telugu, Tamil and Hindi films. She was born to veteran actor Kamal Haasan and Sarika.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu