Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బర్త్ డే స్పెషల్: ఫోటో షూట్లో శృతి హాసన్ అందాల విందు....
Recommended Video
హీరోయిన్ శృతి హాసన్ 2018 క్యాలెండర్ కోసం ఫొటో షూట్లో పాల్గొన్నారు. ఈ ఫొటోలు ఇపుడు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందులో శృతి హాసన్ డ్యూయల్ ఫోజులతో విభిన్నంగా కనిపిస్తోంది. ఆ ఫోటోల సంగతి అటుంచితే.... నేడు శృతి హాసన్ 32వ పుట్టినరోజు.
శృతి హాసన్
శృతి హాసన్ పూర్తి పేరు శృతి రాజ్యలక్ష్మి హాసన్. ప్రముఖ నటుడు కమల్ హాసన్, సారిక దంపతులకు జనవరి 28, 1986లో జన్మించింది. ఆమె కేవలం నటి మాత్రమే కాదు...మంచి సింగర్, మ్యూజిక్ కంపోజర్ కూడా.
సొంతగా ఎదిగేందుకు
కమల్ హాసన్ కూతురుగా తెరంగ్రేటం చేసినప్పటికీ.... తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది హీరోయిన్ శృతి హాసన్. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో గడ్డుకాలం ఎదుర్కొన్నప్పటికీ ఓపికతో ముందుకు సాగుతూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. నటన పరంగానే కాదు...గ్లామర్ పరంగా కూడా తనదైన ముద్ర వేస్తూ దూసుకెలుతోంది.
తొలినాళ్లలో వరుస ప్లాపులు
బాలీవుడ్ మూవీ ‘లక్' చిత్రం ద్వారా శృతి హాసన్ 2009లో హీరోయిన్గా కోరీర్ ప్రారంభించింది. అయితే తొలి చిత్రం ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలేవీ రాలేదు. ఆ తర్వాత 2011లో ‘అనగనగా ధీరుడు' చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం కూడా ఆమెకు నిరాశనే మిగిల్చింది.
పవన్ మూవీతో హిట్స్ బాట
మొదట చేసిన 7 సినిమాలకు శృతి హాసన్‌కు కలిసిరాలేదు. 2012లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రం ద్వారా తొలి విజయం రుచి చూసింది. ఆ తర్వాత ఆమె పలు సినిమాలతో బిజీ అయింది.
సినిమాలు
2017లో ‘సింగం 3', ‘కాటమరాయుడు' సినిమాల్లో శృతి హాసన్ నటించారు. ప్రస్తుతం ‘బెహెన్ హోగీ తెరీ' అనే హిందీ సినిమాలోనూ కథానాయికగా, తండ్రి కమల్ హాసన్ దర్శకత్వంలో ‘శభాష్ నాయుడు' సినిమాలో నటిస్తున్నారు.