twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శృతి హాసన్ 108 ప్రదక్షిణలు చిలుకూరు దేవాలయం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : గబ్బర్ సింగ్ హీరోయిన్ ఇటీవల హైదరాబాద్ సమీపంలోని చిలుకూరు బాలాజీ దేవాలన్ని సందర్శించారు. మొక్కు ప్రకారం ఆమె ఇక్కడ 108 ప్రదక్షిణలు చేసినట్లు సమాచారం. ఇక్కడ ప్రదక్షిణలు చేయడం ఒక ముఖ్య ఆచారం. భక్తులు మొదటిసారి వచ్చినప్పుడు పదకొండు సార్లు ప్రదక్షినలు చేస్తారు. తమ కొరికలు తీరిన తరువాత ఇంకోసారి వచ్చి 108 సార్లు ప్రదక్షినలు చేసి, తమ మొక్కు తీర్చుకొంటారు.

    గబ్బర్ సింగ్ విడుదలకు ముందు కూడా శృతి హాసన్ ఈ దేవాలయాన్ని సందర్శించారు. అప్పటి మొక్కు ప్రకారమే ఆమె మళ్లీ వచ్చినట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ చిత్రం భారీ విజయం సాధించడంతో పాటు హీరోయిన్‌‍గా ఆమెకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా విజయంతో శృతి స్టార్ హీరోయిన్ గా మారడంతో పాటు తెలుగులో పలువురు స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది. గబ్బర్ సింగ్ చిత్రం శృతి కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్.

    ప్రస్తుతం శృతి హాసన్ రవితేజతో బలుపు, రామ్ చరణ్ తేజ హీరోగా రూపొందుతున్న ఎవడు చిత్రాల్లో నటిస్తోంది. అదే విధంగా అల్లు అర్జున్ హీరోగా త్వరలో రూపొందబోయే 'రేస్ గుర్రం' చిత్రంలో కూడా శృతి హాసన్ ఎంపికయింది. మరో వైపు శృతి హాసన్ హిందీలో ప్రభుదేవా దర్శకత్వంలో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం చేస్తోంది. తెలుగులో హిట్టయిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రానికి ఇది రీమేక్.

    English summary
    Actress Shruti Hassan recently visited the Chilkur Balaji Temple near Hyderabad in Andhra Pradesh and spent quite some time inside the temple’s premises. She performed pradarshanam 108 times, a ritual which is usually performed by devotees as a means of saying ‘thanks’ to the Almighty after fulfillment of their wishes. She had been here before her Gabbar Singh release too.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X