21ఏళ్లకే నటి శుభపుటేలా మృతి: హీరో రామ్ ట్వీట్
ఈమె కిడ్నీ సంబంధ వ్యాధి, జాండిస్‌తో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. మరికొందరు ఈమె బ్రెయిన్ హ్యూమరేజ్‌తో మృతి చెందిందని చెబుతున్నారు. అయితే ఈమె మృతికి సంబంధించిన కారణాలు ఆమె కుటుంబం నుండి రావాల్సి ఉంది. పంజాబీకి చెందిన శుభా పుటేలా లూథియానాలో జన్మించింది. ఆమె విద్యాభ్యాసం బెంగళూరులో కొనసాగింది.
బెంగళూరులోనే ఆమె తన పాఠశాల, కళాశాల విద్యను పూర్తి చేశారు. ఈమె తల్లిదండ్రులు, ఓ సోదరుడు, మరో సోదరితో కలిసి ఉంటోంది. ఈమె నటి కాకముందు మోడల్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈమె హెయిల్ ఓ మాక్స్ మిస్ సౌత్ ఇండియా 2010 కిరీటాన్ని దక్కించుకుంది.
ఈమె జ్యూవెలరీ, టెక్స్‌టైల్స్ తదితర వాటికి మోడల్‌గా వ్యవహరించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఈమె రామ్ నటించనున్న ఓ తెలుగు చిత్రానికి సంతకం చేశారు. అయితే ఆరోగ్య కారణాల వల్ల ఆమె నటించలేకపోయింది. కాగా ఈమె మృతిపై నటుడు రామ్ ట్వీట్ చేశారు.
శుభా.. ఇది నిజంగా హర్ట్ బ్రేకింగ్ వార్త. ఈమె టూ యంగ్. టూ యంగ్. స్వీట్, ఇన్నోసెంట్, డెడికేటెడ్ అని ట్వీట్ చేశారు. శుభా తన చిత్రానికి ఎంపికయిందని, అయితే ఆరోగ్య కారణాలతో తప్పుకున్నారని రామ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications












