నిర్మాతగా మారుతున్న మాజీ స్టార్ హీరోయిన్
ప్రస్తుతం వెంకట్ ప్రభు కార్తి హీరోగా 'బిర్యానీ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కార్తి, హన్సిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు ప్రసన్న, నీతు చంద్ర, స్నేహ, రాంకీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
బిర్యానీ చిత్రానికి సంబంధించిన వాల్ పోస్టర్లు ఇప్పటికే విడుదలయ్యాయి. ఇందులో కార్తి, హన్సిక లుక్స్ ఆకట్టుకునే విధంగా ఉండటం చర్చనీయాంశం అయింది. గత సినిమాల కంటే కార్తీని దర్శకుడు వెంకట్ ప్రభు మరింత స్టైలిష్ గా చూపిస్తాడని ఈ పోస్టర్లు చూస్తే స్పష్టం అవుతోంది. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రంలోకి ఒక కొత్త పాత్ర ఎంటర్ అవబోతుంది. కొత్త అంటే కొత్తవాల్లేమి కాదు, ఒకప్పుడు తమిల్ లో మంచి యాక్షన్ చిత్రాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అప్పటి హీరో "రాంకీ".
ఈ మధ్య సినీ పరిశ్రమకు దూరంగా వున్న రాంకీ ఇప్పుడు బిర్యానీ సినిమా తో మళ్ళీ పరిశ్రమ లోకి అడుగుపెట్టబోతున్నాడు. రాంకీ "సిందూరపువ్వు" సినిమాను ఎవరు మర్చిపోయి వుండరు, అంతలా గుర్తుండిపోయింది ఆ సినిమా. అందులో తన సహనటి నిరోషా ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రాంకీ. ఇప్పుడు ఈ బిర్యానీ సినిమా లో రాంకీ ఒక కీలక పాత్ర చేయబోతున్నాడు. అది ఏ పాత్ర, ఎలా వుంటుంది అనేది తెరపైన చూడవలసిందే.


Click it and Unblock the Notifications












