twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘చందమామ’ తార సింధు మీనన్ ఆత్మహత్యాయత్నం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: దక్షిణాది సినిమా నటి సింధు మీనన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తెలుగులో 'చందమామ', 'వైశాలి' చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సింధు మీనన్ ఆత్మహత్యాయత్నం విషయం తెలియడంతో సినీపరిశ్రమ వర్గాలు ఉలిక్కి పడ్డాయి.

    ఆమె అధిక మోతాదులో నిద్రమాత్రలు తీసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె చెన్నైలోని సూర్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యపరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె ఆత్మహత్యపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అప్పుల బాధతో అని కొందరు అంటుంటే, ఇతర వ్యక్తిగత కారణాలు ఉన్నాయని మరికొందరు అంటున్నారు.

    Sindhu Menon

    పలు చిత్రాల్లో నటించినా...స్టార్ హీరోయిన్ నిలదొక్కుకోలేక పోయిన సింధు మీనన్ ఆ తర్వాత సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రభును పెళ్లాడింది. ప్రస్తుతం బెంగుళూరులో ఉంటున్న ఆమె సొంతగా సినిమా నిర్మాణ సంస్థను స్థాపించాలనే ఉద్దేశ్యంతో అప్పలు చేసినట్లు తెలుస్తోంది.

    బహుషా ఆ అప్పులే ఆమెను ఇలాంటి పరిస్థితిలోకి తీసుకెళ్లాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆమెకు సంబంధించిన వ్యక్తిగత విషయాలపైనా ఆరా తీస్తున్నారు. త్వరలోనే సింధు మీనన్‌ కేసులోని పూర్తి వివరాలు బహిర్గతం కానున్నాయి.

    English summary
    Actress Sindhu Menon, who is better known for her performances in ‘Chandamama’ and ‘Vaishali’, has attempted suicide on yesterday night.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X