twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా కడుపులో తన్నింది నిజమే.. హీరో పేరు చెప్పిన శివ పార్వతి, ఏం జరిగిందంటే..

    |

    క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగుతో పాటు పలు దక్షిణాది భాషల్లో నటించిన ప్రముఖనటి శివ పార్వతి ఇటీవల ఓ వెబ్ ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఒక పెద్ద హీరో సినిమా షూటింగ్ జరిగే సమయంలో క్యారెక్టర్లో అతిగా ఇన్వాల్వ్ అయిపోయి మిమ్మల్ని కాలుతో కడుపులో తన్నారట, మీరు దూరం పడిపోయి.. ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్లిపోయే పరిస్థితికి వెళ్లారట.. నిజమేనా? అనే ప్రశ్నికు శివ పార్వతి స్పందిస్తూ ఆ రోజు ఏం జరిగిందో వెల్లడించారు.

    నన్ను తన్నింది హీరో ఉపేంద్ర

    నన్ను తన్నింది హీరో ఉపేంద్ర

    ‘‘ఆ సంఘటన నిజమే. అయితే కోమాలోకి వెళ్లేంత తీవ్రత అందులో లేదు. ఆ హీరో పేరు ఉపేంద్ర. ఆయన క్యారెక్టర్లో బాగా ఇన్వాల్వ్ అయిపోతారు. ఏడుపు సీన్ అయినా అలాగే ఇన్వాల్వ్ అవుతారు. కోపం అయినా అలాగే ఇన్వాల్వ్ అవుతారు. ఈ క్రమంలో ఓవర్ ఎగ్జైట్మెంటుతో అలా చేశారు. దెబ్బలు తగిలాయి. అయితే ఆయన కావాలని ఏమీ కొట్టలేదు'' అని శివ పార్వతి తెలిపారు.

    <strong>నన్నూ ఇలాగే ఇబ్బంది పెట్టారు, వ్యవస్థ ఏమైపోతుంది: కన్నడ హీరో ఉపేంద్ర వివాదాస్పద వ్యాఖ్యలు</strong>నన్నూ ఇలాగే ఇబ్బంది పెట్టారు, వ్యవస్థ ఏమైపోతుంది: కన్నడ హీరో ఉపేంద్ర వివాదాస్పద వ్యాఖ్యలు

    ‘రా' సినిమా సమయంలో..

    ‘రా' సినిమా సమయంలో..

    ‘రా' అనే సినిమా సమయంలో ఇలా జరిగింది. ఆయన అలా తన్నడంతో ఒక్కసారిగా డిస్ట్రబ్ అయిపోయాను. ఆ దెబ్బకు విగ్గు కూడా ఊడిపోయింది. నిజానికి ఆ సీన్ అలాంటిదే. చాలా కోపం వచ్చే సీన్. తన కూతురుకు తనే అన్యాయం చేసే క్యారెక్టర్ అది. అది భరించలేక కొడతాడు. క్లైమాక్స్ లో ఈ సీన్ ఉంటుంది. అలా జరిగిన తర్వాత తనే దగ్గరకు తీసుకుని సారీ అమ్మా.. అని చాలా ఫీలైపోయారు. లేదు బాబు నేను బానే ఉన్నాను అని చెప్పాను... అని శివ పార్వతి గుర్తు చేసుకున్నారు.

    వ్యక్తిగతంగా చాలా మంచోడు

    వ్యక్తిగతంగా చాలా మంచోడు

    వ్యక్తిగా ఉపేంద్ర చాలా మంచి వాడు. కేవలం సెట్‌కు వచ్చేసి తన పని తాను చూసుకుని, మేకప్ తీసేసి.. పేకప్ అనగానే గుడ్ నైట్ అని చెప్పడం కాకుండా సమాజాన్ని ఎక్కువ పరిశీలిస్తుంటాడు. సినిమాల్లో తన పాత్రలు కూడా అలాగే ఉంటాయి. ఒక సినిమాలో అమ్మాయి డ్రెస్సింగ్ వేరే రకంగా వేసుకుంటే... ఈ జబ్బలు ఎవరికి కనిపించాలి? ఎందుకు కనిపించాలి? అంటాడు. అతడు సినిమాలో చెప్పిన పాయింట్ నిజమే కదా అనిపిస్తుంది.

    ఆలోచించాల్సిన పాయింట్స్ ఉంటాయి

    ఆలోచించాల్సిన పాయింట్స్ ఉంటాయి

    ఆయన సినిమాల్లోని కొన్ని పాయింట్స్ మనం ఆలోచిస్తే ఇప్పటి యూత్ అనుకరిస్తున్న డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్.. పద్దతి చూస్తే అలానే ఉంది. వారి కోసం వారు అంత చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో చూడటం కోసం అలంకరించుకుంటారు. అలంకరించుకోవడం తప్పనడం లేదు. నా అలంకరణ మీరు చూసేటపుడు నా మీద మీకు ఒక మంచి భావన కలిగేలా ఉండాలి. స్లీవ్ లెస్ బనియన్ లాంటి డ్రెస్ వేసుకుని ఉన్నానంటే మీకు ఆటోమేటిక్‌గా వేరే భావన కలుగుతుంది. దాన్ని నేను ఎలా ఆపగలను. నేను ఎలా ఉంటే మీరు అలా ప్రవర్తిస్తారు. అది సహజం.

    అలాంటి డ్రెస్సులు ఎవరి కోసం?

    అలాంటి డ్రెస్సులు ఎవరి కోసం?

    అలా ఆయన కొన్ని మంచి విషయాలు తన సినిమాల ద్వారా చెబుతుంటారు. నువ్వు చదువు, ఎదుగు, సమాజానికి ఉపయోగపడు... ఈ డ్రెస్సింగ్ ఏంటి? కిటికీలు, తలుపులు ఉన్న డ్రెస్సులు ఎవరి కోసం వేసుకుంటున్నావ్? అని తన సినిమాల ద్వారా ప్రశ్నిస్తుంటారని... శివ పార్వతి చెప్పుకొచ్చారు.

    English summary
    Actress Siva Parvathi about Kannada star Upendra. Upendra is an actor and politician known for his work in Kannada cinema. He started his film career under actor and film director Kashinath, as a writer and an assistant director. His first directorial venture was Tharle Nan Maga.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X